Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువరాజ్ సింగ్ రీ ఎంట్రీ: సౌరవ్ గంగూలీ హర్షం.. క్రెడిట్ అంతా హాజల్ కీచ్‌కే...

టీమిండియా జట్టులోకి యువరాజ్ సింగ్ రీ ఎంట్రీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. యువీని రెండు ఫార్మాట్లలో ఎంపిక చేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించాడు. యువీపై సె

Advertiesment
Yuvraj Singh
, శనివారం, 7 జనవరి 2017 (15:23 IST)
టీమిండియా జట్టులోకి యువరాజ్ సింగ్ రీ ఎంట్రీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. యువీని రెండు ఫార్మాట్లలో ఎంపిక చేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించాడు. యువీపై సెలక్టర్లు విశ్వాసం ఉంచారని, త్వరలో జరుగనున్న మ్యాచ్‌లలో యువీ తప్పకుండా రాణిస్తాడని.. తప్పకుండా సక్సెస్ అవుతాడని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు. 
 
కాగా యువ‌రాజ్ సింగ్‌ 2013 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో చివ‌రిసారిగా ఆడాడు. వరల్డ్ టీ20లో భాగంగా 2016 మార్చిలో ఆస్ట్రేలితో ఆఖ‌రి టీ20 ఆడాడు. ఈ నేపథ్యంలో హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్నాకే యువీకి అదృష్టం కలిసొచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు.  పెళ్లైన నెల రోజుల్లోనే భారత జట్టులోకి యువీకి స్థానం దక్కిందని ఫ్యాన్స్ చెప్తున్నారు. 
 
గత ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా భారత జట్టులో చోటు దక్కించుకుని, గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆ తరువాత పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు రాలేదు. 2016-17 రంజీ సీజన్‌‌లో ఆడి అద్భుతంగా రాణించాడు. పంజాబ్‌ కెప్టెన్‌‌గా ఐదు మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్ 84 సగటుతో 672 పరుగులు సాధించాడు. దీంతో భారత జట్టులో యువీకి స్థానం కన్ఫామ్ అయ్యింది. అయినప్పటికీ ఈ క్రెడిట్ అంతా హాజల్ కీచ్‌కే దక్కింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నీ ఫార్మాట్లకు ధోనీ బై బై.. విరాట్ కోహ్లీ ఎంపికపై సెలక్టర్ల నిర్ణయం భేష్: గంగూలీ