Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏమో.. భవిష్యత్తులో కోచ్ రేసులో ఉండవచ్చు.. ఇంటర్వ్యూకు వెళ్లవచ్చు!: గంగూలీ

20 సంవత్సరాల క్రితం దేశం తరపున తొలి మ్యాచ్ ఆడానని.. ప్రస్తుతం కోచ్‌ను ఎంపిక చేసే సభ్యుల్లో ఒకడిగా ఉన్నానని.. ఈ క్రమంలో తాను కూడా ఏదోక రోజు కోచ్ రేసులో ఉండొచ్చునని మాడీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన మనసులోన

Advertiesment
Hope to finalise new India coach by June 24: Ganguly
, మంగళవారం, 21 జూన్ 2016 (16:48 IST)
20 సంవత్సరాల క్రితం దేశం తరపున తొలి మ్యాచ్ ఆడానని.. ప్రస్తుతం కోచ్‌ను ఎంపిక చేసే సభ్యుల్లో ఒకడిగా ఉన్నానని.. ఈ క్రమంలో తాను కూడా ఏదోక రోజు కోచ్ రేసులో ఉండొచ్చునని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

గతంలో భారత కోచ్‌గా పనిచేసే తీరిక లేదని గంగూలీ స్పష్టం చేశాడు. కానీ భవిష్యత్తులో మాత్రం భారత క్రికెట్ కోచ్ ఇంటర్వ్యూకు హాజరు కావాలనుకుంటున్నట్లు గంగూలీ తెలిపాడు. ఇప్పటిదాకా కోచ్ పదవి కోసం జరిగిన ఇంటర్వ్యూకు హాజరు కాలేదు. అయితే ఆ రోజు భవిష్యత్తులో వస్తుందనుకుంటున్నట్లు బెంగాల్ దాదా వ్యాఖ్యానించాడు. 
 
2005-06లో గ్రెగ్ చాపెల్ కోచ్ నియామకంలో పరోక్షంగా తన పాత్ర ఉందని.. మళ్లీ కోచ్ ఎంపిక చేసే విషయంలో తనకు అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని సౌరవ్ తెలిపాడు. ఇంకా గంగూలీ మాట్లాడుతూ.. తన సహచరులు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్లతో కలిసి కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యతను అప్పజెప్పారు. ఇవన్నీ తన జీవితంలో చోటుచేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చాడు.
 
కాగా భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ పదవి కోసం దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ 21 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ తీసుకోనుంది. కాగా 24వ తేదీలోపు కోచ్ ఎంపిక పూర్తికావచ్చునని గంగూలీ వ్యాఖ్యానించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలేలో కుర్ర ఆటగాడి చేతిలో ఓడినా పర్లేదు.. వింబుల్డన్‌పై దృష్టిపెడతా: ఫెదరర్