Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంచీ టెస్టు.. స్మిత్ రివ్యూ.. 40 ఓవర్లలో 120 పరుగులు సాధించిన టీమిండియా

రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భారత్ ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు సాధించింది. భారత ఆటగాళ్లలో మురళీ విజయ్ 42, పుజారా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. తద్వారా ఆస్ట్రేలియా 331 పరు

Advertiesment
రాంచీ టెస్టు.. స్మిత్ రివ్యూ.. 40 ఓవర్లలో 120 పరుగులు సాధించిన టీమిండియా
, శుక్రవారం, 17 మార్చి 2017 (17:22 IST)
రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భారత్ ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు సాధించింది. భారత ఆటగాళ్లలో మురళీ విజయ్ 42, పుజారా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. తద్వారా ఆస్ట్రేలియా 331 పరుగుల ఆధిక్యాన్ని సాధించుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగులు సాధించిన ఆస్ట్రేలియాకు భారత్ ధీటుగా బ్యాటింగ్ ద్వారా బదులిచ్చింది. దూకుడుగా ఆడి 67 పరుగులు చేసిన రాహుల్ కొత్త బౌలర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆపై బరిలోకి దిగిన విజయ్ (42) అర్థ సెంచరీ దిశగా రాణిస్తుంగా, పది పరుగులతో పుజారా క్రీజులో నిలిచాడు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లను జడేజా కట్టడి చేయడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. ఆసీస్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్లను ఎదుర్కొనేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో 39వ ఓవర్ 2వ బంతిని లియాన్ సంధించగా, విజయ్ దానిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అది బ్యాటుకి తగల కుండా ప్యాడ్‌కు తగిలి పైకి లేచింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు అవుట్ అంటూ అప్పీలు చేశారు.
 
అంపైర్ దానిని అవుట్ ఇవ్వకపోవడంతో స్మిత్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి వికెట్లకు దూరంగా పడి దూరంగా వెళ్తూ ప్యాడ్‌కు తాకిందని తేలింది. దీంతో ఆసీస్ తొలి రివ్యూను కోల్పోయింది. ఫలితంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 40 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు సాధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇషాంత్ ఫేస్ గేమ్ ఛాలెంజ్: బీసీసీఐ సవాల్‌కు అనూహ్య స్పందన.. హ్యాష్‌ట్యాగ్‌ కూడా?