ఐపీఎల్ 2024 సీజన్ను దృష్టిలో ఉంచుకుని దేశవాణీ క్రికెట్‌కు డుమ్మాకొట్టిన భారత క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల ప్రవర్తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేసింది. కానీ, ఇదే తరహాలో నడుచుకుంటున్న మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై మాత్రం బీసీసీఐ కరుణ చూపింది. దీనిపై దేశం నలుమూలల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదేనని చాలా మంది మాజీ క్రికెటర్లు సమర్థించారు. అయితే చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా, రంజీ ట్రోఫీలో మ్యాచ్లు ఆడకపోయినా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాను మాత్రం గ్రేడ్-ఏ సెంట్రల్ కాంట్రాక్ట్ కొనసాగించడాన్ని పలువురు మాజీలు ప్రశ్నిస్తున్నారు.
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్‌లను సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించి హార్థిక్ పాండ్యాను కొనసాగించడాన్ని ప్రశ్నించాడు. పాండ్యా లాంటి ఆటగాళ్లు జాతీయ జట్టులో లేనప్పుడు రెడ్ బాల్ క్రికెట్ ఆడకూడదనుకుంటే వైట్ బాల్ క్రికెట్‌లో పాల్గొనాలా? అని బీసీసీఐని ప్రశ్నించాడు. అందరికీ ఒకే రూల్స్ ఉండాలని అన్నాడు.
అయితే తాను జాతీయ జట్టుతో లేనప్పుడు దేశవాళీ ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్లు అయిన సయ్యద్ ముస్తాక్ అలీ (T20), విజయ్ హజారే ట్రోఫీలలో ఆడతానంటూ బీసీసీఐ, సెలెక్టర్లకు హార్ధిక్ పాండ్యా హామీ ఇచ్చాకే గ్రేడ్-ఏ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఎలాంటి షరతులు లేకుండా ఈ టోర్నీలలో భాగస్వామ్యం అవుతానని పాండ్యా చెప్పినట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్-2023 సమయంలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా చీలమండ గాయానికి గురయ్యాడు. దీంతో వరల్డ్ కప్ మధ్యలోనే అతడు వైదొలగాడు. అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ పరిమితి ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొనడంపై పాండ్యాతో మాట్లాడామని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పినట్టు రిపోర్టులు వస్తున్నాయి.
'బీసీసీఐ వైద్య బృందం అంచనా ప్రకారం పాండ్యా ప్రస్తుతం టెస్టు ఫార్మాట్ క్రికెట్లో బౌలింగ్ చేసే స్థితిలో లేడు. కాబట్టి పాండ్యాకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు రంజీ ట్రోఫీలో ఆడటం ప్రామాణికం కాదు. అయితే టీమిండియాకి ఆడని సమయంలో ఇతర వైట్-బాల్ టోర్నమెంట్లలో ఆడతానని చెప్పాడు. అలా ఆడకపోతే అతడు కూడా కాంట్రాక్టును కోల్పోతాడు' అని బీసీసీఐ అధికారి తెలిపినట్టు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చాయి.
ఐపీఎల్ 2024 సీజన్ను దృష్టిలో ఉంచుకొని దేశవాళీ క్రికెట్కు డుమ్మా కొట్టిన యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే.