Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగూలీని పరోక్షంగా టార్గెట్ చేసిన రవిశాస్త్రి.. దాదా బెంగాల్ ప్రిన్స్ కాదట..

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని రిజెక్ట్ చేసిన వ్యవహారంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కారణమని వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సౌరవ్ గంగూలీ- రవిశాస్త్రిల మధ్య పచ్చగడ్డి వేస్తే

Advertiesment
Former India cricketer Ravi Shastri takes indirect swipe at Sourav Ganguly
, సోమవారం, 21 నవంబరు 2016 (12:19 IST)
టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని రిజెక్ట్ చేసిన వ్యవహారంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కారణమని వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సౌరవ్ గంగూలీ- రవిశాస్త్రిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో జరగుతున్న రెండో టెస్ట్‌ సందర్భంగా ఈ శత్రుత్వం మరోసారి బయటపడింది. ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఫస్ట్‌సెషన్‌లో రవిశాస్త్రి కామెంటరీ చెబుతూ.. భారత బౌలర్లు షమీ, ఉమేష్‌ యాదవ్‌లను ప్రశంసించాడు. ఉమేష్‌ను 'విదర్భ ఎక్స్‌ప్రెస్‌' అనీ, షమీని 'బెంగాల్‌ సుల్తాన్‌' అని సంబోధించాడు.
 
దీంతో పక్కనే ఉన్న మరో కామెంటేటర్‌ ఇయాన్‌ బోథమ్‌ మైక్‌ అందుకుని.. ఇప్పటికే గంగూలీ బెంగాల్ ప్రిన్స్‌గా ఉన్నాడు కదా.. అన్నాడు. బెంగాల్‌ నుంచి మరో ఐకాన్‌ వచ్చాడా? అని కూడా ప్రశ్నించాడు. ఇందుకు రవిశాస్త్రి స్పందిస్తూ.. బెంగాల్ ఏ ఒక్క ప్రిన్స్‌కే సొంతం కాదని చెప్పుకొచ్చాడు. అస్సలు బెంగాల్‌కు ప్రిన్స్‌లు లేరని పరోక్షంగా గంగూలీని విమర్శించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టూపీస్ బికినీతో షూటింగ్ చేసినప్పుడూ పేరెంట్స్ నాతోనే ఉన్నారు: ఆకాంక్ష శర్మ