Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యా.. నీటిలో పడి చావాలనుకున్నా.. కానీ..?: హగ్

వైవాహిక జీవితం చిందర వందర కావడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన బ్రాడ్ హాగ్ ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైనట్లు తెలిపాడు. బ్

Advertiesment
ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యా.. నీటిలో పడి చావాలనుకున్నా.. కానీ..?: హగ్
, సోమవారం, 31 అక్టోబరు 2016 (15:45 IST)
వైవాహిక జీవితం చిందర వందర కావడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన బ్రాడ్ హాగ్ ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైనట్లు తెలిపాడు. బ్రాడ్ హాగ్ తన తాజా పుస్తకం 'ద రాంగ్ యూఎన్'లో తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను పొందుపరిచాడు.

ఆత్మహత్యాయత్నానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుని..  కారును ఫ్రెమెంటల్స్ పోర్ట్ బీచ్ వద్ద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లాను . అలా సముద్రాన్ని, అందులోని నీటిని చూస్తూ కూర్చున్నా. 
 
అయితే తనకు ఈత  రావడంతో ఆత్మహత్యకు నీటిలో పడటం సరికాదనుకున్నానని తెలిపాడు. మరోసారి చీకటి ప్రదేశంలోకి వెళ్ళి  ప్రశాంతం వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నాను. కానీ ఆ సమయంలో ఇంకా ఏదో సాధించాలనే తపన తనలో ఎక్కువైంది. ఆలోచించడం వేరు, చేయడం వేరు అనే విషయం తనకు అప్పుడో  బోధపడింది.

ఇక ఆత్మహత్య అనే విషయాన్నిపక్కను పెట్టి నా అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యా' అని మాజీ స్పిన్నర్ హాగ్ తెలిపాడు. ఈ క్రమంలోనే 2003, 2007ల్లో ఆస్ట్రేలియా సాధించిన వన్డే వరల్డ్ కప్‌ల్లో హాగ్ కీలక పాత్ర పోషించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పింది.. సారీ చెప్పే ప్రసక్తే లేదు: విలియమ్సన్