Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. రిషబ్ పంత్ సెంచరీ రికార్డ్.. జడేజా అదుర్స్

Advertiesment
rishab panth
, శనివారం, 2 జులై 2022 (10:27 IST)
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో సెంచరీతో ఆదుకున్నాడు. 98 పరుగులకే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన రిషభ్ పంత్.. సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే రేంజ్‌లో ఆడాడు. 
 
ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం క్రీజ్‌లో కుదురుకోవడంతో టీమిండియా పటిష్ఠస్థితికి చేరుకుంది.
 
తద్వారా అత్యంత వేగవంతమైన టెస్ట్ సెంచరీని, ఒక భారత వికెట్ కీపర్ చేసిన వేగవంతమైన టెస్ట్ సెంచరీ, ఇంగ్లాండ్‌లో భారతదేశం తరఫున రెండవ వేగవంతమైన టెస్ట్ సెంచరీని  సాధించిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. 
 
దీంతో తొలి రోజే 338 పరుగుల భారీ స్కోర్ చేయడానికి రిషభ్ పంత్- రవీంద్ర జడేజా ద్వయమే కారణం. ఈ ఇద్దరు రికార్డు స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
 
జట్టు స్కోరు 320 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆరో వికెట్‌గా రిషభ్ పంత్ వెనుదిరిగాడు. 19 ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 146 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 83, మహ్మద్ షమీ-0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు జడేజా కూడా సెంచరీ పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తగ్గేదేలే అంటోన్న రెజ్లర్... సౌరవ్‌ గుజ్లర్‌ పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌ (Video)