ఉత్కంఠకే ఉత్కంఠను నేర్పిన మేటి ఆటలో తలవంచిన భారత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ చివరి రెండు ఓవర్లలో ఈడెన్ గార్డెన్ ప్రేక్షకులను మునిగాళ్లపై నిలబడేలా చేసింది. అది ఉత్కంఠకే ఉత్కంఠను నేర్పిన మేటి ఆట. 12 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంగ్లండ్ తన పథకాన్ని మార్చింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ చివరి రెండు ఓవర్లలో ఈడెన్ గార్డెన్ ప్రేక్షకులను మునిగాళ్లపై నిలబడేలా చేసింది. అది ఉత్కంఠకే ఉత్కంఠను నేర్పిన మేటి ఆట. 12 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంగ్లండ్ తన పథకాన్ని మార్చింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫల్డింగ్ సెట్ చేస్తూ అందరినీ దూరంగా పంపాడు. బౌలర్లు విబిన్నంగా బౌల్ చేశారు. భారత బ్యాట్స్‌మన్‌కు బాల్ అందకుండా ఆఫ్ సైడ్ దూరంగా బంతి విసిరారు. దీంతో దాన్ని కొట్టడం కష్టంగా మారింది. చివరి ఓవర్‌లో 16 పరుగులు తీస్తే భారత్ విజయం ఖాయం అనుకున్నారు. తొలి రెండు బంతుల్లో కేదార్ 6, 4 పరుగులు తీయడంతో మైదానం విద్యుత్తేజానికి గురైంది.
ఇక మనదే విజయం అనుకున్న క్షణాల్లోనే ఓక్స్ పొదుపుగా బౌలింగ్ వేయడంతో తర్వాతి రెండు బంతులకు పరుగులు రాలేదు. అయిదో బంతి పడింది. కేదార్ షాట్‌కు బాల్ గాల్లో లేచింది. విజయమా పరాజయమా అంతా ఆ బంతిమీదే ఆధారపడి ఉంది. ఇంతలోనే కేదార్ క్యాచ్ ఔట్. సిక్సర్ వెళ్లాల్సిన బంతి ఫీల్డర్ చేతికి చిక్కంది. ఆ క్షణమే గెలుపు భారత్ నుంచి చేజారిపోయింది. కేదార్ నెత్తురు చుక్క లేని ముఖంతో పెవిలియన్ చేరాడు. తదుపరి బంతి డాట్ బాల్ కావటంతో గెలుపు ఇంగ్లండ్ వశమైంది.
నాలుగు టెస్టుల్లో అపజయం.. రెండు వన్డేల్లో ఓటమి.. అతిథి జట్టు ఇంగ్లండ్ కల ఎట్టకేలకు ఈడెన్ గార్డెన్స్‌లో ఈడేరింది. 2001 అక్టోబరు 25న ఇదే గ్రౌండ్‌లో జరిగిన వన్డేలో ఇంగ్లండ్‌పై టీమిండియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం నాటి వన్డేలో పోరాడి ఆరు పరుగుల తేడాతో ఓడింది. చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. 49వ ఓవర్‌లో 7 పరుగులు చేశారు. 50వ ఓవర్‌లో 16 పరుగులు కావాలి. మొదటి బంతి సిక్సర్, రెండో బంతి ఫోర్ కొట్టిన జాదవ్.. జట్టును గెలుపునకు దగ్గరగా తీసుకెళ్లాడు. తర్వాత రెండు బంతుల్లో పరుగులు చేయలేకపోయాడు. అయిదో బంతికి భారీ షాట్ కొట్టబోయి బిల్లింగ్స్‌కు చిక్కాడు.
ఇక ఒక్క బంతిలో ఆరు పరుగులు కావాలి. భువనేశ్వర్ ఆ బంతిని అందుకోలేకపోయాడు. ఆఫ్ స్టిక్‌కు దూరంగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరి రెండు ఓవర్లలో ఇంగ్లండ్ అనుసరించిన వ్యూహం ఫలించింది. జె.బాల్, వోక్స్ అన్ని బంతులు ఆఫ్ స్టిక్‌కు దూరంగానే విసిరారు. జాదవ్ కూడా కొన్ని బంతులను అందుకోలేకపోయాడు. రెండు ఓవర్లలో 6 బంతులు డాట్ బాల్స్ కావడం విశేషం.