తొలి ట్వంటీ-20లో భారత్ ఓటమి.. కోహ్లీ సేన రికార్డులు.. రెండో టీ-20లో గెలుస్తుందా?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రిపబ్లిక్ డే రోజున జరిగిన తొలి ట్వంటీ-20లో టీమిండియా ఓటమి చెందింది. కానీ ఈ విజయంతో మూడు ట్వంటి-20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రిపబ్లిక్ డే రోజున జరిగిన తొలి ట్వంటీ-20లో టీమిండియా ఓటమి చెందింది. కానీ ఈ విజయంతో మూడు ట్వంటి-20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ గత భారత టీ20 కెప్టెన్లెవరూ నెలకొల్పని రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన అనంతరం తొలి టీ20 మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
దీంతో తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, అజింక్యా రహానేలకు సాధ్యం కాని ఈ రికార్డును కోహ్లీ సొంతం చేసుకోవడం విశేషం. ఇంగ్లండ్‌తో మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓటమి పాలై వెనుకబడిన విరాట్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు మరో కఠినమైన సవాల్కు సిద్ధమైంది.
ఆదివారం విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో జరిగే రెండో ట్వంటీ 20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం రాత్రి 7గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తేనే సిరీస్లో నిలుస్తుంది. కానిపక్షంలో సిరీస్ను మ్యాచ్ మిగిలి వుండగానే చేజార్చుకోవాల్సి వస్తుంది. అయితే ఈ స్టేడియంలో భారత్ ఆడిన రెండు అంతర్జాతీయ ట్వంటీ 20ల్లోనూ ఓటమి పాలుకావడం జట్టును కలవరపరుస్తోంది.
తొలి టీ20 విజయంతో భారత్‌పై ఇంగ్లాండ్ అద్భుతమైన రికార్డుని నమోదు చేసింది. ఈ విజయంతో భారత్‌పై ఇంగ్లాండ్ 6-3 రికార్డుని సొంతం చేసుకుంది. ఇండియాపై ఇప్పటి వరకు టీ20ల్లో ఆరుసార్లు ఏ జట్టూ విజయం సాధించలేదు. ఇంగ్లాండ్ తర్వాత భారత్‌పై అత్యధికంగా న్యూజిలాండ్ 5 సార్లు విజయం సాధించింది.
కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. టీ20ల్లో1500 పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. మొత్తంగా చూస్తే 12వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.