Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుణాచల్ ప్రదేశ్‌ - సిక్కింలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం!!

Advertiesment
evm vote

ఠాగూర్

, ఆదివారం, 2 జూన్ 2024 (09:34 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆ రాష్ట్రంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధిక మంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అంటే పది మంది అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో 50 స్థానాలకు జరిగిన పోలింగ్ నిర్వహించారు. ఈ ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం నుంచి చేపట్టారు. 
 
లోక్‌సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయమే కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ మొదలైన గంట తర్వాత అరుణాచల్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
 
ఇక సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఆధిక్యంలో కనిపిస్తోంది. కౌంటింగ్‌కు సంబంధించి ఉదయం 7.30 గంటల సమయంలో సిక్కింలో అధికార ఎస్కేఎం పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ ఒక చోట, ప్రతిపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థులు పలు చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.
 
అరుణాచల్ ప్రదేశ్‌లో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆదివారం 50 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. మిగతావారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుండి టెకీ కాసో, తాలిహా నుండి న్యాతో దుకమ్, రోయింగ్ నుంచి ముచ్చు మితితో పాటు పలువురు ఉన్నారు. 2019లో 41 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో తమ అభ్యర్థులను ఇక్కడ బరిలో నిలిపింది.
 
ఇకపోతే, సిక్కిం విషయానికి వస్తే అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం), విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రెండు పార్టీలు మొత్తం 32 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక బీజేపీ అక్కడ 31 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : సన్నాహక మ్యాచ్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తు!!