టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కిడ్నాప్ గురించి ముంబైలో జోరుగా ప్రచారం సాగుతోంది. అతడిని కిడ్నాప్ చేశారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. విరాట్ కోహ్లీ మనస్తత్వంపై బాలీవుడ్‌లో డిషూమ్ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో కోహ్లీని పోలి వున్న క్రికెటర్ పాత్రలో సకీబ్ సలీమ్ నటిస్తున్నాడు. మరో ప్రధాన పాత్రలో జాన్ అబ్రహాం నటిస్తున్నాడు.
ఈ సినిమాలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ఆకట్టుకునే.. జట్టుకు విజయాన్ని సమకూర్చగలిగే క్రికెటర్‌గా సకీబ్ కనబడుతున్నాడని తెలిసింది. ఈ సినిమాను సాజిద్ నడియవాలా నిర్మాణంలో డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్నాడు.
అధికారికంగా చెప్పకపోయినా అది కోహ్లీ స్ఫూర్తిగా తెరకెక్కుతుందని చెప్పాలి. సకీబ్ కూడా కోహ్లీని పోలిన పాత్రలో మెప్పిస్తాడని తెలుస్తోంది. ఇక, తాజా విషయమేమిటంటే ఈ సినిమాలో విరాట్ పాత్రధారి సకీబ్ కిడ్నాప్‌నకు గురవుతాడట. జాన్ అబ్రహం అతణ్ని కిడ్నాప్ చేస్తాడట. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది.