Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్ని క్రికెట్ ఫార్మెట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్!

Advertiesment
dinesh karthik

ఠాగూర్

, ఆదివారం, 2 జూన్ 2024 (10:15 IST)
అన్ని క్రికెట్ ఫార్మెట్ల నుంచి క్రికెటర్ దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌కు టాటా చెప్పేసిన విషయం తెల్సిందే. తాజాగా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు అధికారిక ప్రకటన చేశాడు. ఇంతకాలం పాటు తనకు మద్దతు పలికిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన తల్లిదండ్రులు తనకు అన్నివేళలా వెన్నుదన్నుగా నిలిచారని వెల్లడించాడు. వాళ్ల దీవెనలు లేనిదే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని పేర్కొన్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని అదృష్టంగా భావిస్తానని తెలిపాడు.
 
డీకేగా సుప్రసిద్ధుడైన దినేశ్ కార్తీక్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. 2000వ సంవత్సరం ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన దినేశ్ కార్తీక్... 26 టెస్టులు, 94 వన్డేలు, 60 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ నమోదు చేశాడు. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించని తత్వం, నరనరానా పోరాట తత్వాన్ని జీర్ణించుకున్న వైనం... దినేశ్ కార్తీక్ ను ఇప్పటివరకు ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిపింది.
 
ఎంఎస్ ధోనీ మాంచి ఊపుమీదున్న టైమ్‌లో బీసీసీఐ పెద్దలు మరో వికెట్ కీపర్ కోసం చూడాల్సిన అవసరం లేకపోయింది. దాంతో దినేశ్ కార్తీక్‌కు రావాల్సినన్ని అవకాశాలు రాలేదన్న వాదనలు ఉన్నాయి. ఒక విధంగా ధోనీ ప్రాభవం చాటున డీకే కెరీర్ మరుగునపడిపోయిందని చెప్పాలి. ఇక, ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : న్యూయార్క్ సన్నాహక మ్యాచ్‌లో భద్రతా లోపం!!