Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోస్త్...! మేరా దోస్త్...!! పాత మిత్రుణ్ణి ఆశ్చర్యపరిచిన ధోనీ... ఎవరా దోస్త్ ?

webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2015 (07:53 IST)
ఒక స్థాయి దాటితే చాలా మంది స్నేహితులను మరచిపోతారు. వారితో తమకు పనేముంది అన్నట్లు వ్యవహరిస్తారు. ఏ స్థాయికెళ్లినా పాత మిత్రులను గుర్తు పెట్టుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కోవలోకి వస్తారు క్రికెట్ కెప్టెన్ ధోనీ.. తాను ఫ్రెండ్‌షిప్ డే రోజున తన పాత స్నేహితుడిని ఆశ్చర్య పరిచారు. వివరాలిలా ఉన్నాయి. 
 
రైల్వేస్‌లో టీటీగా పని చేసే రోజుల్లో జార్ఖండ్‌కు ధోనీ, టీటీగానే పని చేస్తున్న విపిన్‌ సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌కు ఆడేవారు. టోర్నీ సమయాల్లో ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారు. గత ఐదేళ్లుగా విపిన్‌తో మాట్లాడని ధోనీ.. ఆదివారం తన ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు రావాల్సిందిగా ఫోన్‌ చేసి అతణ్ణి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆహ్వానం మేరకు విపిన్‌.. ధోనీ కుటుంబాన్ని కలిశాడు. పాత రోజులను చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. 

Share this Story:

Follow Webdunia Hindi