టీమిండియా మాజీ పేసర్ కపిల్ దేవ్‌ను దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ అధిగమించాడు. సంప్రదాయ టెస్టుల్లో 434 వికెట్లు సాధించిన కపిల్ దేవ్‌ను స్టెయిన్ 437 వికెట్లతో వెనక్కి నెట్టాడు. ఇంకా 437 వికెట్లతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌తో సమానంగా వున్నాడు. ఫలితంగా 437 వికెట్లతో దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టెయిన్ రికార్డుల్లోకి ఎక్కాడు.
దీంతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో స్టెయిన్ ఏడో స్థానంలో నిలిచాడు. ప్రోటీస్ మాజీ బౌలర్ షాన్ పొల్లాక్ (421) ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. కానీ అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్లలో మాత్రం 4వ స్థానం సంపాదించాడు.
కాగా డేల్ స్టెయిన్ వరుస గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గాయాల నుంచి తేరుకునేందుకు రెండేళ్లు పట్టింది. ప్రస్తుతం గాయాల నుంచి ఫామ్‌లోకి వచ్చిన స్టెయిన్.. టెస్టుల్లో రాణిస్తున్నాడు. ఫలితంగా 437 వికెట్లు పడగొట్టి వికెట్ల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు.