సతీమణి కోసం గాయకుడి అవతారం ఎత్తిన ఇర్ఫాన్ పఠాన్.. వీడియో చూడండి..
టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ తన భార్య కోసం ఓ ప్రేమ పాటను పాడిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశాడు. మాజీ బౌలర్ అయిన ఇతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను హడలెత్తింపజేసే వాడు. ఇన్నాళ్లు ఇర్ఫ
టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ తన భార్య కోసం ఓ ప్రేమ పాటను పాడిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశాడు. మాజీ బౌలర్ అయిన ఇతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను హడలెత్తింపజేసే వాడు. ఇన్నాళ్లు ఇర్ఫాన్ పఠాన్ అంటే బౌలింగ్ చేసే చూసివుంటాం. అయితే ప్రస్తుతం ప్రేమ పాటలు పాడే సింగర్‌గా అతడు మారిపోయాడు.
ఇర్ఫాన్ పఠాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ''బద్రినాథ్ కీ.." అంటూ పాటను పాడి.. ఆ వీడియోను భార్యకు అంకితం చేశాడు. టీమిండియా ఆటగాళ్లలో హర్భజన్ సింగ్ సింగర్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ కూడా భజ్జీలా గాయకుడిగా మారిపోయాడు. వీరిద్దరే కాదు.. మాజీ బౌలర్ శ్రీశాంత్ కూడా సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ భార్య కోసం ఎలా పాడాడో ఈ వీడియో ద్వారా చూడండి.