Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీమిండియాకు కొత్త కోచ్... రికీ పాంటింగ్‌ హెడ్ కోచ్ అవుతాడా?

Advertiesment
టీమిండియాకు కొత్త కోచ్... రికీ పాంటింగ్‌ హెడ్ కోచ్ అవుతాడా?
, గురువారం, 2 మే 2019 (14:46 IST)
టీమిండియాకు కొత్త కోచ్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి ప‌ద‌వీ కాలం ఈ ప్ర‌పంచ‌ క‌ప్‌తో ముగియ‌నుంది. త‌రువాత టీమిండియాకు కోచ్ ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌ర‌గుతోంది. ఈ నేపధ్యంలో గంగూలి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిరేపుతున్నాయి. 2015 నుంచి గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీకి బీసీసీఐ అప్పగిస్తూ వస్తోంది. 
 
టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎవరు ఉండాలి..? అనే నిర్ణయాన్ని ఈ కమిటీనే నిర్ణయించింది. ఈ క‌మిటీనే ఒక సారి కుంబ్లే…త‌రువాత ర‌విశాస్త్రిని కోచ్‌గా నియ‌మించింది. గంగూలి వ్యాఖ్య‌లు చూస్తే త‌రువాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ అనే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.
 
రికీ పాంటింగ్ ఏడాదిలో 8 నుంచి 9 నెలలు ఇంటికి దూరంగా ఉండగలడా..? ఒకవేళ అతను ఉండగలను అంటే మాత్రం.. నిస్సందేహంగా టీమిండియా‌కి గొప్ప కోచ్ అవుతాడంటూ గంగూలీ పరోక్షంగా సంకేతాలిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ సేన అదుర్స్.. కింగ్‌గా నిలిచిన చెన్నై.. అగ్రస్థానంలో ఎల్లో ఆర్మీ