Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌లో కీపర్‌గా ధోనీ వేస్ట్.. దినేష్ కార్తీక్ బెస్ట్.. నిజమేనా?

Advertiesment
Mahendra Singh Dhoni
, ఆదివారం, 22 మే 2016 (11:32 IST)
అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరు అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పే సమాధానం మహేంద్ర సింగ్ ధోనీ పేరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ధోనీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం వేస్ట్ కీపర్‌గా పేరుగడించాడు. అదేసమయంలో దినేశ్ కార్తీక్ బెస్ట్ కీపర్‌ అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
ఐపీఎల్ పోటీల్లో మొత్తం 97 మందిని ఔట్ చేయడం ద్వారా దినేష్ ముందు నిలిస్తే, ధోనీ 89 మందిని మాత్రమే ఔట్ చేయగలిగాడు. 71 క్యాచ్‌లు, 26 స్టంపింగ్‌లతో దినేష్ తాను ధోనీ కన్నా బెస్టనిపించుకోగా, ధోనీ 62 క్యాచ్ లు, 27 స్టంపింగ్‌లు చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈ సీజన్ పరుగుల విషయంలోనూ కార్తీక్, ధోనీని వెనక్కు నెట్టేశాడు. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 220 పరుగులు చేయగా, కార్తీక్ 280 పరుగులు చేశాడు. ధోనీ ఒక్క అర్థ శతకం కూడా సాధించలేకపోగా, కార్తీక్ మూడు హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్... సెక్రటరీగా షిర్కే