Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తగ్గని క్రిస్ గేల్ సత్తా.. బ్యాట్ విరిగిపోయింది..

Advertiesment
gayle
, గురువారం, 23 నవంబరు 2023 (14:29 IST)
gayle
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ సత్తా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడుతున్న గేల్ విజృంభిస్తున్నాడు. భిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతులను ఎదుర్కొన్న గేల్ 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. 
 
ఈ క్రమంలో ఓ ఫోర్ కొట్టినప్పుడు బ్యాట్ విరిగిపోయింది. దీంతో గేల్ సహా గ్రౌండ్‌లో వున్నవారంతా నవ్వును ఆపుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భిల్వారా కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 ఫార్మెట్ నుంచి రోహిత్ శర్మ నిష్క్రమించినట్టేనా?