ఐసీసీ ర్యాంకింగ్స్: 18వ స్థానంలో ఇషాంత్ శర్మ, కోహ్లీ డౌన్!

బుధవారం, 2 సెప్టెంబరు 2015 (14:54 IST)
ఐసీసీ ప్రకటించిన తజా టెస్టు ర్యాంకింగ్స్‌లో బౌలర్ ఇషాంత్ శర్మ తన ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. వీరిలో ముఖ్యంగా ఇషాంత్ శర్మ మూడు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకుకు చేరుకున్నాడు.
 
అశ్విన్ 50వ స్థానంలో, అమిత్ మిశ్రా 59వ స్థానాలను దక్కించుకున్నారు. మరోవైపు బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా కూడా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 20వ స్థానంలో నిలిచాడు. అయితే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకున్నాడు.
 
అయితే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. నిన్నటి వరకు రెండో ర్యాంకులో ఉన్న కోహ్లీ అనూహ్యంగా టాప్ పొజిషన్ చేజిక్కించుకున్నాడు. నిన్నటిదాకా టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ 871 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి