Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మహిళతో సెల్ఫీ దిగితే గోల్డెన్ డకౌట్ కావాల్సిందే.. జట్టూ ఓడిపోవాల్సిందే.. ఎవరామె?

జైనాబ్ అబ్బాస్. ఈ పేరు ఇపుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇంతకీ ఈమె ఎవరన్నదే కదా మీ సందేహం. ఈమె ఎవరో కాదు.. పాకిస్థాన్ స్పోర్ట్స్ ఎనలిస్ట్. ఛాంపియన్స్ ట్రోఫీ అప్‌డేట్స్ అందించేందుకు ఇంగ్లండ్‌లో ఉంద

Advertiesment
Champions Trophy 2017
, శనివారం, 10 జూన్ 2017 (15:51 IST)
జైనాబ్ అబ్బాస్. ఈ పేరు ఇపుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇంతకీ ఈమె ఎవరన్నదే కదా మీ సందేహం. ఈమె ఎవరో కాదు.. పాకిస్థాన్ స్పోర్ట్స్ ఎనలిస్ట్. ఛాంపియన్స్ ట్రోఫీ అప్‌డేట్స్ అందించేందుకు ఇంగ్లండ్‌లో ఉంది. ఈమె ఏబీ డివిలీర్స్, విరాట్ కోహ్లీని గోల్డెన్ డకౌట్ చేసింది. అదేంటి ఆమె డకౌట్ చేయడమేంటనే కదా మీ ప్రశ్న. ఈ ఇద్దరు కెప్టెన్లతో ఆమె సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీ మహిమతో ఇద్దరూ కెప్టెన్లూ డకౌట్ కావడమే కాకుండా, ఏకంగా మ్యాచ్‌లలో కూడా ఓడిపోయారు. దీంతో జైనాబ్ అబ్బాస్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. 
 
పాకిస్థాన్‌తో దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆడేముందు సఫారీ కెప్టెన్ ఏబీ.డివిలీర్స్‌తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే, ఆ మ్యాచ్‌లో డివిలీర్స్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అలాగే, ఆదివారం శ్రీలంకతో భారత్ మ్యాచ్ ఆడేందుకు ముందు స్టేడియంకి వచ్చిన జైనాబ్ అబ్బాస్... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే, ఆ మ్యాచ్‌లో కోహ్లీ కూడా డకౌట్ అయ్యాడు. పైగా జట్టు కూడా ఓడిపోయింది. దీంతో ఆమెది ఐరన్ లెగ్ అంటూ కోహ్లీ, డివిలీర్స్ అభిమానులు మండిపడుతున్నారు.
 
అయితే, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మాత్రం సంబరబడిపోతూ... ఆమెను మరోలా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అదెలాగంటే... సోమవారం పాకిస్థాన్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. దీంతో శ్రీలంక కెప్టెన్‌తో ఆమె సెల్ఫీ దిగాలంటూ కోరుతున్నారు. ఇలా చేస్తే తమ జట్టు గెలుస్తుందన్నది వారి మూఢనమ్మకంగా ఉంది. మరి జైనాబ్ అబ్బాస్ ఏం చేస్తుందో వేచిచూద్ధాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్