Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

153 కేజీల భారీకాయుడు... క్రీజ్‌లో పరుగెత్తలేక రిటైర్డ్ హర్ట్... (Video)

అతనో క్రికెటర్. పైగా, భారీ కాయుడు. బరువు 153 కేజీలు. కానీ, బ్యాటింగ్‌కు దిగితే సిక్స్‌లు, ఫోర్లను అలవోకగా బాదేస్తుంటాడు. కానీ, క్రీజ్‌లో పరుగెత్తాలంటే మాత్రం మహా చిరాకు. చివరకు క్రీజ్‌లో పరుగెత్తలేక ర

Advertiesment
153 కేజీల భారీకాయుడు... క్రీజ్‌లో పరుగెత్తలేక రిటైర్డ్ హర్ట్... (Video)
, ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (10:37 IST)
అతనో క్రికెటర్. పైగా, భారీ కాయుడు. బరువు 153 కేజీలు. కానీ, బ్యాటింగ్‌కు దిగితే సిక్స్‌లు, ఫోర్లను అలవోకగా బాదేస్తుంటాడు. కానీ, క్రీజ్‌లో పరుగెత్తాలంటే మాత్రం మహా చిరాకు. చివరకు క్రీజ్‌లో పరుగెత్తలేక రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరిన ఆసక్తికర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... వెస్టిండీస్‌లో కరీబియన్ లీగ్‌ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో శనివారం బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ లూయిస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బొడోస్ జట్టు 195 పరుగులు చేసింది. సెంచరీతో డ్వెన్ బ్రావో కదంతొక్కాడు. దీంతో ఆ జట్టు ప్రత్యర్థి సెయింట్ లూయీస్ జట్టుకు భారీ లక్ష్యం విధించింది. 
 
దీంతో లక్ష్య చేదనకు బరిలోకి దిగిన సెయింట్ లూయిస్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టులో భారీకాయుడిగా పేరొందిన రకీమ్ కార్నివాల్ (153 కేజీలు) బౌలర్లపై విరుచుకుపడి ఆదుకున్నాడు.
 
సిక్సర్లు, బౌండరీలతో బౌలర్లను ఆటాడుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఈ భారీ కాయుడికి వికెట్ల మధ్య పరుగులు తీయడం కష్టంగా మారింది. దీంతో 18వ ఓవర్ రెండో బంతి సమయంలో కడుపునొప్పి బాధించడంతో రిటైర్డ్‌ హర్ట్‌‌గా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 
 
ఇలా శరీర బరువు మోయలేక ఇబ్బందికి గురై ఓ బ్యాట్స్‌మెన్ రిటైర్డ్ హర్ట్ అయిన తొలి సంఘటన ఇదే కావడం విశేషం. గతంలో ఎవరైనా గాయాల పాలైతే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా రిటైర్డ్ హర్ట్ అయిన సంఘటనలు క్రికెట్ చరిత్రలో లేక పోవడం గమనార్హం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలింగా ఇంట్లో కోహ్లీ సేన... మందు పార్టీలో మునిగితేలిన క్రికెటర్లు?