Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగూలీ మళ్లీ దెబ్బేశాడు.. ఇక రవి-కోహ్లీకి ఆడింది ఆట కాదు..

విరాట్ కోహ్లీ కోరిక మేరకు సచిన్ టెండూల్కర్ సిఫార్సుతో అతి కష్టంమీద రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించి ఉండవచ్చు కానీ కోచ్‌గా రవి శాస్త్రి నియామకాన్ని చివరివరకు అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైన గంగూలీ మరోవైపు అటు కోహ్లీకి, ఇటు రవిశాస్త్రికి

Advertiesment
Ravi Shastri
హైదరాబాద్ , గురువారం, 13 జులై 2017 (03:43 IST)
విరాట్ కోహ్లీ కోరిక మేరకు సచిన్ టెండూల్కర్ సిఫార్సుతో అతి కష్టంమీద రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించి ఉండవచ్చు కానీ కోచ్‌గా రవి శాస్త్రి నియామకాన్ని చివరివరకు అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైన గంగూలీ మరోవైపు అటు కోహ్లీకి, ఇటు రవిశాస్త్రికి  ఇద్దరికీ చెక్ పెట్టేలా రంగంమీదికి ఇద్దరిని తీసుకువచ్చాడు. అందుకే రవిశాస్త్రికి ప్రధాన కోచ్ పదవి లభించినా అతడి స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడానికి జహీర్ ఖాన్‌ని, రాహుల్ ద్రావిడ్‌ని రంగంమీదికి తేవడం విశేషం.
 
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించగా, అనూహ్యంగా కోచ్‌కు సహాయ సిబ్బందిని తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది. అయితే కోచ్‌ నియమాకం అంత ఈజీగా జరగలేదని తెలుస్తోంది. రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయకుండా అడ్డుకునేందుకు మాజీ కెప్టెన్ గంగూలీ చివరి వరకూ ప్రయత్నించాడు. క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ)కి చీఫ్‌గా ఉన్న గంగూలీ గత ఏడాది రవిశాస్త్రి కోచ్‌ కాకుండా అడ్డుకున్నాడు. అప్పుడు అనిల్ కుంబ్లేకు కోచ్ చాన్స్ దక్కింది. ప్రస్తుతం రవిశాస్త్రికి ప్రధాన కోచ్ పదవి లభించినా.. అతనికి పూర్తి స్వేచ్ఛ ఉండేలా చాన్స్ లేదని అందుకు గంగూలీ తీసుకున్న నిర్ణయాలు కారణమని క్రీడా నిపుణులు భావిస్తున్నారు
 
హెడ్ కోచ్ ప‌ద‌వి విషయంలో త‌న మాట నెగ్గించుకోలేక‌పోయిన గంగూలీ బౌలింగ్ కోచ్ విష‌యంలో తన పంతం నెగ్గించుకున్నాడు. ర‌విశాస్త్రి కోరుకున్న భ‌ర‌త్ అరుణ్‌ను కాద‌ని మాజీ సహచరుడు జ‌హీర్‌ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియ‌మించడంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ఎలాగు సీఏసీ చర్యలు తీసుకుంటుందని, విదేశీ పర్యటనల కోసం ప్రత్యేక బ్యాటింగ్ క‌న్సల్టెంట్‌గా ద్రవిడ్‌ను నియ‌మించి ర‌విశాస్త్రి పాత్రను తగ్గించేందుకు చేసిన గంగూలీ ప్లాన్ సక్సెస్ అయింది.
 
తొలిదశ దరఖాస్తుల్లో లేని రవిశాస్త్రి ఈ సారి కూడా కోచ్ పదవి ఇవ్వరని భావించి అనాసక్తి చూపించాడు. సచిన్ సూచనతో ముంబైకర్ రవిశాస్త్రి బరిలో నిలవగా, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోచ్ పదవికి పోటీ పడడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. రవిశాస్త్రి పేరును గంగూలీ తీవ్రంగా వ్యతిరేకించినా సీఏసీలో మెంబరైన స‌చిన్ ఒత్తిడి చేయడంతో గంగూలీ వెన‌క్కి త‌గ్గాల్సి వచ్చింది. కెప్టెన్‌ కోహ్లీతో పాటు జట్టు కోరుకున్న వ్యక్తినే కోచ్‌గా ఇవ్వడం క‌రెక్ట్ అని స‌చిన్‌ గంగూలీని ఒప్పించడంతో రవిశాస్త్రికి కోచ్ పదవి లభించింది. అయితే బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్, బ్యాటింగ్ క‌న్సల్టెంట్‌ ద్రవిడ్‌లు గంగూలీకి సన్నిహితులని శాస్త్రికి పూర్తి స్థాయిలో పగ్గాలు అందకూడదనే ఈ పని చేసినట్లు సమాచారం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేకింగ్ న్యూస్... మిథాలీరాజ్ వరల్డ్ రికార్డ్...(Details)