Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరంగేట్రంలోనే అర్థసెంచరీ.. మయాంక్ అదుర్స్.. నిరాశపరిచిన హనుమ విహారి

అరంగేట్రంలోనే అర్థసెంచరీ.. మయాంక్ అదుర్స్.. నిరాశపరిచిన హనుమ విహారి
, బుధవారం, 26 డిశెంబరు 2018 (13:00 IST)
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌‌లో భారత్ ఇన్నింగ్స్‌ నిలకడగా ఆడుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ చేశాడు. 95 బంతుల్లో మయాంక్ అర్థ సెంచరీని సాధించాడు. తద్వారా అరంగేట్రంలోనే అర్థశకతం సాధించిన ఏడవ భారత ఓపెనర్‌గా గుర్తింపును సంపాదించుకున్నాడు. 
 
మయాంక్‌ కన్నా ముందు శిఖర్ ధావన్, పృథ్వీషా, గవాస్కర్, ఇబ్రహీం, అరుణ్, హుస్సేన్‌లు ఈ రికార్డును సాధించారు. తొలి టెస్టులోనే అద్భుతంగా రాణించి సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని మాయంక్ నిలబెట్టుకున్నాడు. అయితే శతకాన్ని మాత్రం సాధించలేకపోయాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మయాంక్ 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్‌‌లో పెవిలియన్‌కు చేరాడు. 
 
మరోవైపు మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో ప్రారంభమైన మూడో టెస్టులో ఓపెనర్‌గా లభించిన అవకాశాన్ని తెలుగు కుర్రాడు హనుమ విహారి సద్వినియోగం చేసుకోలేకపోయాడు.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఓపెనర్ జోడీని మారుస్తూ, విహారి, మయాంక్ అగర్వాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు పంపింది. కానీ ఎనిమిది పరుగుల వద్ద కుమిన్స్ బౌలింగ్‌లో పించ్‌కు క్యాచ్ ఇచ్చిన హనుమ విహారి.. పెవిలియన్‌కు చేరాడు. 
 
ఇదే సమయంలో ఆచితూచి ఆడుతున్న మయాంక్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారాతో కలసి స్కోరును 50 పరుగులు దాటించాడు. దీంతో మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. మయాంక్ 76 పరుగుల వద్ద అవుట్ కాగా, హనుమ  విహారి 8 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ (47), చటేశ్వర్ పుజారా (68) ఉన్నారు. మరో వైపు ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ ఒక్కడే రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ఇల్లు లేదు.. బస్సులోనే నివసిస్తున్నా.. ధోనీ