Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లబుషేన్‌ విచిత్రంగా పెవిలియన్ చేరాడు-వీడియో నెట్టింట వైరల్

Advertiesment
లబుషేన్‌ విచిత్రంగా పెవిలియన్ చేరాడు-వీడియో నెట్టింట వైరల్
, శనివారం, 15 జనవరి 2022 (17:10 IST)
Labushen
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ విచిత్రంగా పెవిలియన్ చేరిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్ బౌలింగ్‌లో లుబుషేన్ ఔటయ్యాడు. అది 23వ ఓవర్. 134.1 వేంగంతో వచ్చిన బాల్‌ను అడ్డుకోవడంలో విఫలమైన లుబుషేన్ విఫలమయ్యాడు. 
 
బంతిని ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వికెట్ ముందు బోర్లాపడ్డాడు. బంతి మాత్రం వికెట్లను ముద్దాడి బెయిల్స్‌ను పడేసింది.
 
ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేస్తున్న లబుషేన్‌ను ఇలా బౌల్డ్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల ఆనందాలకు అవధులే లేకుండా పోయాయి. ఇలా ఊహించని రీతిలో ఔటవ్వడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు ఈ ఆసీస్‌ బ్యాటర్. 
 
సిరీస్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఇప్పటికే యాషెస్‌ సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. నాలుగో టెస్టు డ్రా అవ్వడంతో, ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌లో పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది.
 
ఇంగ్లండ్‌లో అత్యంత విజయవంతమైన రెండో బౌలర్ బ్రాడ్. టెస్టుల్లో అతని పేరు మీద 500 కంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ తరఫున జేమ్స్ అండర్సన్ అతని కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. 
 
ఈ మ్యాచ్‌లో బ్రాడ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. మునుపటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాను తొమ్మిదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు. ఖవాజా ఆరు పరుగులు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌ను చిత్తు చేసిన సఫారీలు - టెస్ట్ సిరీస్ కైవసం