ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల ఓ మహిళతో పాటు అభిమానులు దాడికి పాల్పడ్డారు. ముంబైలోని శాంటా క్రూజ్ ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో షాపై దాడి చేసిన దుండగులను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్, ఆమె స్నేహితురాలుగా గుర్తించారు.
రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ వంటి ఇండస్ట్రీ సూపర్ స్టార్స్‌తో భోజ్‌పురి సినిమాలో పనిచేసిన నటి సప్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో 2,19,000 మంది ఫాలోయర్స్‌ను కలిగివుంది. సప్నా, చండీగఢ్‌కు చెందినవారు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు.
సప్నా 'కాశీ అమర్‌నాథ్', 'నిర్హువా చలాల్ లండన్' వంటి సినిమాలతో పాటు ఇటీవల 2021లో విడుదలైన 'మేరా వతన్' వంటి సినిమాల్లో నటించింది.
గిల్- ఆమె స్నేహితుడు షాతో సెల్ఫీ అడిగారు. మొదట్లో వారి అభ్యర్థనలకు ఓకే చెప్పిన షా.. తర్వాత రెండో సెల్ఫీకి మాత్రం అంగీకరించలేదు. దీంతో వాగ్వాదం జరిగింది.
తర్వాత పృథ్వీ తన స్నేహితుడితో కలిసి తన కారులో హోటల్ ప్రాంగణం నుంచి బయలుదేరినప్పుడు, సప్న, ఆమె స్నేహితురాలు మరికొంతమంది అతని కారును వెంబడించి, ఓషివారా సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అడ్డగించి, విండ్‌షీల్డ్‌ను పగలగొట్టారు. దాడి చేశారు. ఈ ఘటనపై నటి సప్నాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.