Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బ్యాష్ సిరీస్.. ముస్తాఫిజుర్ కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ.. ఎవరికి దక్కుతాడో?

Advertiesment
Bangladeshi star Mustafizur Rahman could spark BBL interest
, సోమవారం, 9 మే 2016 (20:00 IST)
ఆస్ట్రేలియాలో ఐపీఎల్ త‌ర‌హాలో జ‌రిగే బిగ్‌బ్యాష్ సిరీస్ కోసం ఆయా జ‌ట్లు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌పున ఆడుతున్న సంచ‌ల‌న బౌల‌ర్ ముస్తాఫిజుర్‌ను కొనేందుకు బిగ్‌బ్యాష్ ఫ్రాంఛైజీలు పోటీప‌డుతున్నారు. ఐపీఎల్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపిస్తున్న ముస్తాఫిజుర్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. 
 
ఇప్పటికే మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్టుకు టామ్ మూడీ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతను ఐపీఎల్‌లో సన్ రైజర్స్ కోచ్‌గా వ్యవహరించడం ద్వారా మెల్ బోర్న్ రెనిగేడ్స్ ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 
 
ఒక‌వేళ ముస్తాఫిజుర్‌ను బిగ్‌బ్యాష్‌లో ఏదోక జ‌ట్టు కొంటే ఆ సిరీస్‌లో ఆడే రెండో బంగ్లాదేశీ క్రికెట‌ర్‌గా ఈ యువ‌బౌల‌ర్‌గా రికార్డు నెలకొల్పనుండటం గమనార్హం. ఇప్పటికే మ‌రో బంగ్లా క్రికెట‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ బిగ్ బ్యాష్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్ కంటే, కాంబ్లీనే బెస్ట్.. వారిద్దరి మధ్య పోలికలేంటంటే?: కపిల్ దేవ్