Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. 22 పరుగుల తేడాతో బంగ్లా పరాజయం: షబ్బీర్‌కు రూట్ ఓదార్పు అదుర్స్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 22 పరుగుల తేడాతో ఖంగుతింది. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండగా.. ఆట ఐదో రోజున బంగ్లాదేశ్ 33 పరుగులు సాధించాల్సింది. కానీ పది పరుగులు మాత్రమే సాధించ

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. 22 పరుగుల తేడాతో బంగ్లా పరాజయం: షబ్బీర్‌కు రూట్ ఓదార్పు అదుర్స్
, సోమవారం, 24 అక్టోబరు 2016 (15:56 IST)
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 22 పరుగుల తేడాతో ఖంగుతింది. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండగా.. ఆట ఐదో రోజున బంగ్లాదేశ్ 33 పరుగులు సాధించాల్సింది. కానీ పది పరుగులు మాత్రమే సాధించి 22 పరుగుల తేడాతో మ్యాచ్‌ను జారవిడుచుకుంది. కాగా ఇంగ్లండ్‌ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్య ఛేదనలో.. నాలుగో రోజైన ఆదివారం ఆట చివరకు బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో (78 ఓవర్లు) 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. 
 
సబ్బీర్‌ రహ్మాన్‌ (59 బ్యాటింగ్‌), తైజుల్‌ ఇస్లాం (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అయితే ఇంగ్లండ్ పేస్ బౌలర్ బెన్ స్టోక్స్ ఒకే ఓవర్లో రెండు ఎల్బీడబ్ల్యూ ఔట్‌లు సాధించి.. తన జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
 
253/8 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ చివరి రెండు వికెట్లను పది పరుగుల వ్యవధిలో కోల్పోయి ఖంగుతింది. సోమవారం ఆటలో బంగ్లాకు 33 పరుగులు అవసరమైన క్రమంలో బెన్ స్టోక్స్ ఒక్క బంతి వ్యవధిలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్కు విజయాన్ని అందించాడు.
 
బంగ్లా స్కోరు 263 పరుగుల వద్ద ఓవర్ నైట్ ఆటగాడు తైజుల్ ఇస్లామ్(16) తొమ్మిదో వికెట్ గా అవుట్ కాగా, అదే స్కోరు వద్ద షాఫుల్ ఇస్లామ్ డకౌట్ వెనుదిరిగాడు. దాంతో మరో ఓవర్ నైట్ ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్(64 నాటౌట్) అవతలి ఎండ్లో ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ రాణించిన స్టోక్స్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగులకే ఆలౌటైంది. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు చేతులెత్తేసింది.

ఇదిలా ఉంటే.. బంగ్లా ఆటగాడు షబ్బీర్ రెహ్మాన్ 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చివరివరకూ అద్భుతమైన పోరాట పటిమను కనబర్చాడు. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ విజయానికి అవసరమైన రెండు వికెట్లను వరుసగా పడగొట్టి బంగ్లాకు షాకిచ్చాడు. దీంతో ఒక్కసారిగా క్రీజ్‌లో ఉన్న షబ్బీర్ రెహ్మాన్ బ్యాట్‌తో పాటు కింద కూర్చుని దిగాలుగా తలదించేశాడు.

అయితే దీన్ని గమనించిన ఇంగ్లాండ్ ఆటగాడు జాయ్ రూట్ వెంటనే షబ్బీర్ రహ్మాన్ వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతన్ని ఓదార్చాడు. ఈ సంఘటన ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మ్యాచ్ గెలిచినా సరే ప్రత్యర్ధి జట్టు ఆటగాడి పరిస్థితి గమనించి జాయ్ రూట్ ప్రవర్తించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొహాలీ వన్డేలో ధోనీ రికార్డుల మోత.. సెంచరీని ఎందుకు మిస్ చేసుకున్నాడో తెలుసా?