Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్‌కు అరుదైన ఘట్టం: మెహదీ అదుర్స్.. 19 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై గెలుపు

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సంప్రదాయ టెస్టు క్రికెట్లో అరుదైన ఘట్టాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ తొలిసారిగా ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఈ గెలుపుకు 19 ఏళ్ల నూనూగు మీసాల కుర్రాడు కీలకపాత్ర పోషించాడు. అ

టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్‌కు అరుదైన ఘట్టం: మెహదీ అదుర్స్.. 19 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై గెలుపు
, మంగళవారం, 1 నవంబరు 2016 (15:18 IST)
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సంప్రదాయ టెస్టు క్రికెట్లో అరుదైన ఘట్టాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ తొలిసారిగా ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఈ గెలుపుకు 19 ఏళ్ల నూనూగు మీసాల కుర్రాడు కీలకపాత్ర పోషించాడు. అతను ఎవరంటే.. బంగ్లాదేశ్ కొత్త స్పిన్ సంచలనం మెహదీ హసన్ మిరాజ్. లైన్ తప్పని బౌలింగ్‌తో పాటు సంప్రదాయ ఆఫ్ స్పిన్‌కు వైవిధ్యాన్ని జోడిస్తూ బంతులు విసరడం మెహదీ ప్రత్యేకత. 
 
కాగా మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెహదీ హసన్‌ ఆడిన రెండు టెస్టుల్లో 19 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ సిరిస్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో చోటు దక్కించుకున్న మెహదీ హసన్‌ తొలి టెస్టు సిరిస్‌లో ఆకట్టుకున్నాడు. కేవలం బౌలర్‌గానే కాదు కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కూడా సత్తా చాటాడు. 2014 వరల్డ్ కప్‌లోనూ అతను బంగ్లాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 
 
తన కెరీర్‌ను బ్యాట్స్‌మన్‌గా మొదలుపెట్టినప్పటికీ, మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ షేక్‌ సలావుద్దీన్‌ స్ఫూర్తితో ఆఫ్‌స్పిన్నర్‌గా మారాడు. అండర్‌ 19 వరల్డ్ కప్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన మెహదీ హసన్‌ 12 వికెట్లు తీయడంతో పాటు 242 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మెహదీ హసన్‌ ఏకంగా 28 స్థానాలు ఎగబాకి 33వ స్థానానికి చేరుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళిరోజు ఏ గిఫ్ట్ ఇస్తారని అడిగితే.. విడాకులు ఇచ్చారు: ఇమ్రాన్‌పై రెహమ్ కామెంట్స్