షబ్బీర్ రెహమాన్‌కు తలనొప్పి.. పోలీసు దుస్తుల్లో రెచ్చగొట్టేలా నైలా.. ఆల్కహాలుకు ప్రమోషన్
24 ఏళ్ల యువ క్రికెటర్ షబ్బీర్ రెహమాన్ చిక్కుల్లో పడ్డాడు. బంగ్లా క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న షబ్బీర్ రెహ్మాన్.. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఓ వివాదాస్పద యాడ్‌లో నటించి తలనొప్పి తెచ్చుకున్నాడు.
24 ఏళ్ల యువ క్రికెటర్ షబ్బీర్ రెహమాన్ చిక్కుల్లో పడ్డాడు. బంగ్లా క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న షబ్బీర్ రెహ్మాన్.. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఓ వివాదాస్పద యాడ్‌లో నటించి తలనొప్పి తెచ్చుకున్నాడు. 34 ఏళ్ల బంగ్లాదేశ్ హాట్ మోడల్ నైలా నయీమ్ తో శృతిమించి షబ్బీర్ నటించాడు.ఈ యాడ్ బంగ్లాదేశ్ ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ దుమారం రేగుతోంది.
ఈ యాడ్ లో నైలా పోలీస్ దుస్తుల్లో రెచ్చగొట్టేలా కనిపించడం.. ఆల్కహాలిక్ డ్రింక్‌ను షబ్బీర్ ప్రమోట్ చేయడం.. దీనిని తాగాలంటే ప్రైవసీ కావాలని షబ్బీర్ అనడం వంటివి బంగ్లా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ యాడ్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది.
కాగా షబ్బీర్ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు లో అద్భుత పోరాట పటిమను కనబరిచాడు. అతని సహచరులనుండి సహకారం లభించక పోవడంతో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయానికి దూరమైంది. షబ్బీర్ పోరాట పటిమకు బంగ్లా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇంతలోనే ఆస్కార్ యాడ్‌తో షబ్బీర్‌పై విమర్శలు వస్తున్నాయి.