Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళి వేడుకలో ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్న యువరాజ్ సింగ్.. ఎందుకో తెలుసా?

నటి హాజెల్‌కీచ్‌తో వివాహం ముగిసిన తర్వాత చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయంలో, గోవాలో హిందూ సంప్రదాయ పద్ధతిలో యువరాజ్, కీచ్‌లు ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళి వేడుకలో యువీ ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకు

Advertiesment
Aww! Yuvraj Singh broke down at his own wedding
, ఆదివారం, 4 డిశెంబరు 2016 (17:45 IST)
నటి హాజెల్‌కీచ్‌తో వివాహం ముగిసిన తర్వాత చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయంలో, గోవాలో హిందూ సంప్రదాయ పద్ధతిలో యువరాజ్, కీచ్‌లు ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళి వేడుకలో యువీ ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. గోవాలో వివాహ తంతు ముగిశాక తన భార్య కీచ్‌ గురించి చెప్పేందుకు యూవీ స్టేజెక్కాడు. ఈ సందర్భంగా తన తల్లి షబ్నమ్ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. 
 
తండ్రి కుటుంబం నుంచి దూరంగా జరిగాక కుటుంబాన్ని పోషించేందుకు తల్లి ఎన్నో ఇబ్బందులు పడిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచిందంటూ కంటతడి పెట్టుకున్నాడు. తర్వాత తేరుకుని మళ్లీ మాట్లాడుతూ తనకు కేన్సర్ ఉందని తెలిసిన క్షణం కుంగిపోయానని పేర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తల్లి తనకు అండగా నిలిచిందని, ఎంతో ధైర్యాన్ని నూరిపోసిందని చెప్పుకొచ్చాడు. 
 
ఇదిలా ఉంటే.. హజల్ కీచ్‌తో ప్రేమలో పడిన యువరాజ్ సింగ్ ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీన చతర్ పూర్‌లోని ఫామ్ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ మించిపోయాడు.. ఎవరా క్రికెటర్!