Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ఆటగాళ్లకు కొరకరాని కొయ్యి ఒకీఫె... ఆ ముగ్గురి సలహాలతోనే టీమిండియా నడ్డివిరిచాడు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. పూణె వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 333 పరుగుల తేడాతో చిత్తైంది. ఇంతటి భారీ విజయం నమోదు చేయడానికి ప్రధాన కారణం ఆసీస్ జట్టులోని

భారత ఆటగాళ్లకు కొరకరాని కొయ్యి ఒకీఫె... ఆ ముగ్గురి సలహాలతోనే టీమిండియా నడ్డివిరిచాడు
, ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (12:29 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. పూణె వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 333 పరుగుల తేడాతో చిత్తైంది. ఇంతటి భారీ విజయం నమోదు చేయడానికి ప్రధాన కారణం ఆసీస్ జట్టులోని ఎడంచేతి స్పిన్నర్ ఒకీఫె. మూడు దేశాలకు చెందిన స్పిన్ దిగ్గజాలు ఇచ్చిన సలహాలు, సూచనలను పక్కాగా అమలు చేసి భారత ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు. ఆ లెగ్ స్పిన్నర్ గురించి మరింతగా విశ్లేషిస్తే.. 
 
32 ఏళ్ల ఒకీఫె ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌‌లో పేరున్న ఆటగాడు. దేశవాళీ టోర్నీల్లో ఇప్పటివరకు 225 వికెట్లు పడగొట్టాడు. అయితే గట్టి పోటీ ఉన్న ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించి అంతర్జాతీయ క్రికెట్‌‌లోకి అడుగుపెట్టేందుకు చాలా సమయం పట్టింది. 2014లో శ్రీలంకతో ఆడి నాలుగు మ్యాచ్‌‌లలో 14 వికెట్లు తీశాడు. దీంతో ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్‌ను భారతీయుల ఆటకట్టించడంలో మెళకువలు అడిగి తెలుసుకున్నాడు.
 
అలాగే ఇంగ్లండ్ ఆటగాడు మాంటీ పనేసర్‌ను మరిన్ని కిటుకులు నేర్చుకున్నాడు. దీనికితోడు తన దేశానికి చెందిన స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ నిరంతరం ఒకీఫెను పర్యవేక్షిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో దుబాయ్‌‌లో నిర్వహించిన ప్రాక్టిస్ సెషన్స్‌లో వారు చెప్పిన సలహాలు అమలు చేశాడు. అంతేకాకుండా 2015లో ఆస్ట్రేలియా-ఎ జట్టు సభ్యుడిగా భారత్‌‌లో రెండు అనధికార మ్యాచ్‌‌ల టెస్ట్ సిరీస్‌‌లో ఆడాడు. ఈ అనుభవం ఇప్పుడతనికి అక్కరకొచ్చింది. 
 
అలాగే, భారత ఆటగాళ్లు ఆసీస్ ప్రధాన స్పిన్నర్‌ నాథన్ లియోన్‌‌పై దృష్టిపెట్టారు. దీనికితోడు భారత ఆటగాళ్ల నిర్లక్ష్యం, కొత్త స్పిన్నర్ ఒకీఫెపై శ్రద్ధ పెట్టకపోవడం అతనికి బాగా కలిసివచ్చింది. ఫలితంగా మైదానంలోకి దిగిన ఒకీఫె తన పని తాను కొన్ని గంటల్లో పూర్తి చేశాడు. అదీ కాకుండా ఎడమచేతి వాటం ఆటగాడు కావడంతో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ఆటగాళ్ళలో పోరాటపటిమ ఉంది.. కోహ్లీ సేనకు సచిన్ ఓదార్పు