Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవజ్యోత్ సింగ్ సిద్ధూ గుండె ధైర్యానికి నా సెల్యూట్ : కేజ్రీవాల్

భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు

Advertiesment
Arvind Kejriwal
, మంగళవారం, 19 జులై 2016 (09:31 IST)
భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. "ఓ సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాజీనామా చేశాడు. సిద్ధూ గుండె ధైర్యానికి నా సెల్యూట్" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ 52 సంవత్సరాల సిద్ధూ, భారత మాజీ క్రికెటర్‌గా అభిమానులందరికీ సుపరిచితుడన్నారు. అలాంటి వ్యక్తి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా, వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ యువతిని చేయి పట్టుకొని లాగాడు.. నిర్భయ కేసు పెట్టారు!