Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్ .. ఏపీలోని 13 జిల్లాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు

rohit - pat photo shoot
, ఆదివారం, 19 నవంబరు 2023 (13:12 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీ ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభంకానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ నగరంలోని మొతేరా స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. దీంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ భిమానులు ఫైనల్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల్లో భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బిగ్ స్క్రీన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ అనుమతి ఇచ్చారని ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ స్క్రీన్‌లపై దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వరకు క్రికెట్ ఆఖరి పోరాటాన్ని వీక్షించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 
 
ఉమ్మడి 13 జిల్లాల్లో ఈ బిగ్ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్టణం ఆర్కే బీచ్ రోడ్డులో కాళీమాత ఆలయం ఎదురుగా ఒక బిగ్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, జిల్లాల వారీగా స్క్రీన్ల వివరాలు: విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా, అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్  (పి.టి.సి),  ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్, కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, కర్నూల్: డి.ఎస్.ఏ. స్టేడియం, నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్, ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం, శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్, తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్, విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక, విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలలో వీటిని ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వ్యక్తి కోసం ప్రపంచ కప్ గెలవాలనుకుంటున్నాం.. రోహిత్ శర్మ