Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు.. జడేజా భాయ్‌తో మంచి అనుబంధం ఉంది.. పోటీ తప్పదు: అక్షర్ పటేల్

Advertiesment
Akshar Patel
, బుధవారం, 30 డిశెంబరు 2015 (15:32 IST)
దేశం కోసం ఆడుతున్నప్పుడు ఎవరి నుంచైనా పోటీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డేల్లో తుది జట్టులో చోటుపై ఇప్పుడే చెప్పలేనని.. అయితే జాతీయ జట్టుకు ఆడాలంటే అన్ని వైపుల నుంచి పోటీని ఎదుర్కోవాలని అక్షర్ పటేల్ తెలిపాడు.

ప్రపంచ కప్ చేరువలో ఉన్న సమయంలో టి20 జట్టులో చోటు దక్కకపోవడం తనకు నిరాశ కలిగించిందని చెప్పిన అక్షర్...తాను ఊహించినదానికంటే తక్కువ వయసులోనే భారత్‌కు ఆడగలగడం అదృష్టమన్నాడు.
 
కాగా రవీంద్ర జడేజా పునరాగమనంతో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ స్థానానికి జడేజా, పటేల్ మధ్య గట్టి పోటీ ఏర్పడిన నేపథ్యంలో రెండో స్పిన్నర్‌గా ఎవరిని ఎంచుకోవాలనేది కూడా ధోనికి సమస్యగా మారింది.

దీనిపై అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. తామిద్దరం గుజరాతీలమేనని, జడేజా భాయ్‌తో తనకు మంచి అనుబంధమే ఉంది. అయితే తుది జట్టులో ఇద్దరిలో ఒకరమే ఉంటామని నాకూ తెలుసు. అయితే క్రికెట్ అంటే అదే. కాబట్టి పోటీ గురించి నాకు బెంగ లేదు’ అని అక్షర్ అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu