Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అట్టహాసంగా ఇషాంత్ శర్మ మ్యారేజ్.. బాస్కెట్ ప్లేయర్‌ ప్రతిమా సింగ్‌తో వివాహం..

టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ ఇంటివాడయ్యాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్‌తో ఇషాంత్ శర్మ వివాహం గుర్గావ్‌కు సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. హర్భజన్ సింగ్, యువరాజ్

Advertiesment
A courtside match: Ishant Sharma weds Pratima Singh
, ఆదివారం, 11 డిశెంబరు 2016 (13:06 IST)
టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ ఇంటివాడయ్యాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్‌తో ఇషాంత్ శర్మ వివాహం గుర్గావ్‌కు సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లు ఇప్పటికే ఓ ఇంటివారు కాగా, ప్రస్తుతం ఇషాంత్ శర్మ కూడా పెళ్లిచేసేసుకున్నాడు. ఈ వేడుకకు టీమిండియా ఆటగాళ్లు ధోని, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 
జూన్‌లో ఇషాంత్ శర్మ వీళ్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇషాంత్‌శర్మ టీమిండియా పాస్ట్‌బౌలర్ కాగా, ప్రతిమ సింగ్‌ జాతీయ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్. ప్రతిమ గతంలో భారత్‌ తరపున జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లకు ప్రాతినిథ్యం వహించింది. 
 
కొంతకాలం కెప్టెన్‌గా వ్యవహరించింది కూడా. ప్రతిమకు నలుగురు సిస్టర్స్ కాగా అందులో ఈమె చిన్నది, అందరూ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్స్ కావడం విశేషం. వాళ్లంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో రాణించారు. బాస్కెట్‌బాల్‌ టీమ్‌లో వీరు 'సింగ్‌ సిస్టర్స్‌'గా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో ఇంగ్లండ్‌తో టెస్టు.. విరాట్ కోహ్లీ రికార్డుల పంట.. కెరీర్‌లో 15వ సెంచరీ