ఇంగ్లాండ్‌తో తాజాగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లోనూ సెంచరీలతో కదం తొక్కిన యువరాజ్ సింగ్ తన ఖాతాలో పదో సెంచరీని చేర్చుకున్నాడు. తొలి వన్డేలో 138 పరుగులు చేసిన యువీ, రెండో వన్డేల్లోనూ 118 పరుగులు చేశాడు.
తాజా వన్డేతో యువీ పరుగుల ఖాతాలో 6379 పరుగులు చేరాయి. 219 మ్యాచ్‌ల్లో ఆడిన యువరాజ్ సింగ్ 38 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇకపోతే... 23 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్, మూడు అర్ధశతకాలు, మూడు సెంచరీలతో 1050 పరుగులు చేశాడు.
అదేవిధంగా.. ఆడిన ఏడు టీ-20 మ్యాచ్‌ల్లో యువరాజ్ యువరాజ్ సింగ్ రెండు అర్ధ సెంచరీలతో 179 పరుగులు చేశాడు. ఛండీఘడ్‌లో 1981 డిసెంబర్ 12వ తేదీన జన్మించిన యూవీ... వన్డేల్లో ఫార్ట్‌టైమ్ బౌలర్‌గా వ్యవహరిస్తూ ఇప్పటివరకు 50 వికెట్లు పడగొట్టాడు.