Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ క్రికెట్ లెజండ్ 'హర్యానా హరికేన్'

Advertiesment
భారత్ క్రికెట్ లెజండ్ 'హర్యానా హరికేన్'

WD

హైదరాబాద్ (ఏజెన్సీ) , ఆదివారం, 3 జూన్ 2007 (18:08 IST)
భారత క్రికెట్ అభిమానులు ఆరాధించే హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పేరు భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. ప్రపంచ క్రికెట్ యనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన క్రికెట్ వీరుడు. 1983లో జరిగిన ప్రపంచ కప్‌లో చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న వెస్టిండీస్‌ను మట్టికరిపించి, భారత్‌కు ప్రపంచ కప్‌ను సాధించి పెట్టి, కోట్లాది మంది భారతీయ ప్రజల్లో క్రికెట్ హీరోగా అవతరించాడు.

ఎక్కడపుట్టారు?

కపిల్ దేవ్ పూర్తి పేరు.. కపిల్ దేవ్ రామ్‌లాల్ నిఖాన్జ్., పంజాబ్-హర్యానా రాష్ట్రంలోని ఛండీఘర్‌లో 1959 జనవరి 16వ తేదీన జన్మించాడు. 48 సంవత్సరాల 137 రోజుల వయస్సు కలిగన కపిల్.. భారత్. హర్యానా, నార్తంప్ట్‌షైర్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కుడిచేతి బ్యాటింగ్ ప్రతిభ కలిగిన కపిల్, కుడి చేతి ఫాస్ట్ మీడియం పేస్‌తో ప్రపంచ క్రికెటర్లను ముప్పతిప్పలు పెట్టించాడు.

ఆ ఇన్నింగ్సే కీలక మలుపు..

1978 అక్టోబరు ఒకటో తేదీన పాకిస్తాన్ గడ్డలోని క్వెట్టా మైదానంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో కపిల్ దేవ్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేట్రం చేశాడు. అలాగే.. 1978 అక్టోబరు 16వ తేదీన పైసలాబాద్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లోకి కాలుమోపాడు. తన కెరీర్‌లో మొత్తం 131 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కపిల్ దేవ్ 5,248 పరుగులు చేయగా, వన్డే మ్యాచ్‌లలో 225 మ్యాచ్‌లు ఆడి, 3,783 పరుగులు చేశాడు. అత్యధికంగా 1983లో జరిగిన ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై 175 (నాటౌట్) పరుగులు చేసి, భారత్‌కు విశ్వకప్‌ను అందించాడు. అలాగే.. టెస్టుల్లో భారత్ తరపున 434 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన తొలిబౌలర్‌గా ఖ్యాతికెక్కాడు. వన్డేల్లో 253, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 835, లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 335 వికెట్లు తీశాడు.

Share this Story:

Follow Webdunia telugu