Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడిలేచిన కెరటం బెంగాల్ "సౌరభం"

Advertiesment
పడిలేచిన కెరటం బెంగాల్
, గురువారం, 13 డిశెంబరు 2007 (12:19 IST)
ఫిట్‌నెస్ లేదు. వయస్సు మీదపడింది. యువతకు అవకాశం ఇచ్చేందుకు జట్టు నుంచి తప్పుకోవాలి. రాజకీయాల వల్లే జట్టులో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. ఇలాంటి విమర్శలు ఎన్నో. భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత ధైర్యస్తుడు సౌరభ్ గంగూలీ. ఎక్కడో అకాశం అంత ఎత్తులో వున్న గంగూలీ. ఒక్కసారిగా కుళ్లు రాజకీయాలు అకస్మాత్తుగా అధఃపాతాళానికి తొక్కేశాయి. జట్టులో స్థానం పోయింది.

కానీ అతనిలోని పట్టుదల మాత్రం తరగిపోలేదు. తిరిగి బ్యాట్, ప్యాడ్ చేతపట్టి, తనకు క్రికెట్ పాఠాలు నేర్పిన ఈడెన్ గార్డెన్స్‌లో కఠోర శ్రమ. ఫలితం ఒక చిన్న అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తర్వాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న క్రికెటర్ ఈ కోల్‌కతా ప్రిన్స్. భారత మాజీ కెప్టెన్, కోల్‌కతా ప్రిన్స్, బెంగాల్ దాదా అంటూ ప్రేక్షకులే కాదు... తోటి సహచరులు కూడా మద్దుగా పిలుచుకునే సౌరవ్ గూంగూలీ ముంగిట మరో అరుదైన రికార్డు కనిపిస్తోంది.

అదే.. సెంచరీకి చేరువ కావడం. పరుగుల వేటలో కాదండీ.. వంద టెస్ట్‌లు ఆడటంలో. ఈ రికార్డుకు మరొక టెస్ట్ మ్యాచ్‌ దూరంలో గంగూలీ ఉన్నాడు. ఈ రికార్డును వచ్చే ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తి చేయనున్నాడు. గంగూలీ కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్ట్‌లు ఆడి 43.17 సగటుతో 6346 పరుగులు చేశాడు. అలాగే.. తాజా స్వదేశంలో పాకిస్తాన్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసి "మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు"ను కెరీర్‌లో మూడో సారి కైవసం చేసుకున్నాడు.

ముఖ్యంగా.. ఒకే క్యాలెండర్‌లో వెయ్యి (1023) పరుగులను 63.93 సగటుతో పూర్తి చేశాడు. అంతేకాకుండా.. బెంగుళూరులో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెచరీ (239), రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసిన క్రికెటర్‌గా గంగూలీ రికార్డు సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్క్ టేలర్‌ (ఒకే టెస్టులో ట్రిపుల్ సెంచరీ, 92 పరుగులు నాటౌట్) మాత్రమే ఇలాంటి అరుదైన రికార్డును నమోదు చేశాడు.

అలాగే.. పాక్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌లలో 89 శాతం సగటుతో 534 పరుగులు చేసి అద్భుతంగా రాణించిన గంగూలీ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu