క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మన్‌ను అధిగమించిన సచిన్ టెండూల్కర్!
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లో సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. ఆస్ట్రేలియాకు చెందిన వార్తాపత్రిక ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ నిర్వహించిన సర్వేలో సచిన్ టెండూల్కర్ 67 శాతం ఓట్లు కొట్టేశాడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ బ్రాడ్‌మనా? టెండూల్కరా? అనే అంశంపై నిర్వహించిన సర్వేలో మొత్తం 20,768 మంది క్రికెట్ అభిమానులు పాల్గొనగా, అందులో 67 శాతం మంది తెండూల్కర్‌కు ఓటు వేశారు. 33 శాతం మంది బ్రాడ్‌మన్‌కు ఓటేశారు.ప్రపంచ క్రికెట్‌లో 50 టెస్టు సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఆదివారం రికార్డు సృష్టించిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌కే ఈ సర్వేలో అత్యధిక ఓట్లు దక్కాయి. ఈ సర్వేలో అభిమానులు సచిన్‌ను ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టారు. బ్రాడ్‌మన్ మొత్తం ఏడువేల పరుగులు చేయగా, ఇందులో ఐదు వేలు ఒకే దేశంపై చేశాడు. బ్రాడ్‌మన్ కేవలం నాలుగు దేశాలతోనే ఆడాడు. ప్రపంచ బౌలర్లను బ్రాడ్‌మన్ ధీటుగా ఎదుర్కోలేడు. ఉదాహరణకు గంటకు 95 మైళ్ల వేగంతో బౌలింగ్ చేయగల లార్వూడ్ వంటి బౌలర్లను బ్రాడ్‌మన్ ఎదుర్కోలేదని ఈ సర్వేలో పాల్గొన్న ఓ ఓటరు వ్యాఖ్యానించారు. అలాగే బ్రాడ్‌మన్ కన్నా టెండూల్కర్ మెరుగైన బ్యాట్స్‌మన్. బ్రాడ్‌మన్ ఒకే ఫార్మాట్‌లో ఆడగా, టెండూల్కర్ మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఇంకా విభిన్న రకాలు గల అనేక పిచ్‌లపై సచిన్ ఆడాడు. భిన్న ప్రత్యేకతలు గల బౌలర్లను ఎదుర్కొని టెస్టులు, వన్డేల్లోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఎప్పటికైనా ఉత్తమ బ్యాట్స్‌మన్ టెండూల్కరే అనడంలో ఎలాంటి సందేహం లేదని మరో ఓటరు వ్యాఖ్యానించారు.ఇంకా బ్రాడ్‌మన్-సచిన్ టెండూల్కర్‌లు తమ కెరీర్‌లో చేసిన సాధనలపై పలువురు ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిలో ఎక్కువ శాతం మంది సచిన్ ఆటతీరే భేష్ అని పేర్కొన్నారు. తద్వారా ఈ సర్వేలో మాస్టర్ బ్లాస్టర్‌కే అత్యధిక ఓట్లు లభించాయి.