బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సఫారీ జట్టు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ బ్యాట్స్‌మెన్లు మరోమారు స్పిన్ ధాటికి కుప్పకూలారు. బ్యాటింగ్ పిచ్‌గా పేరొందిన ఈ స్టేడియం కూడా స్పిన్‌కు దాసోహమైంది. దీంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇందులో ఓపెనర్లు వాన్ జిల్ 10, ఎల్గర్ 38, ప్లెసిస్ 0, ఆమ్లా 7, డి విలియర్స్ 85, డుమ్నీ 15, విలాస్ 15, అబ్బాట్ 14, రబడ 0, మోర్కెల్ 22, తాహిర్ 0 చొప్పున పరుగులు చేశారు. వీరిలో జిల్, ఎల్గర్‌లు అశ్విన్, జడేజాల ఉచ్చులో ఆరంభంలోనే చిక్కుకుని పెవిలియన్ దారిపట్టారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు కూడా స్పిన్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడలేక పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజాలు నాలుగేసి వికెట్లు తీయగా, అరోన్ ఓ వికెట్ తీశాడు.