ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ మరణ వార్త విని యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఆంగ్ల దినపత్రికలో పొరబాటు దొర్లింది. విషయం ఏమిటంటే... ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతికి సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో సంతాప ప్రకటన చేశాడు.
ఆ సందేశం కాస్తా పత్రికలో తప్పుగా ప్రచురితమైంది. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని సచిన్ ట్వీట్ చేస్తే, పత్రికలో ఏం వచ్చిందో చూడండి! సచిన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రచురించారు. దీంతో, మాస్టర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. 'ఆ పత్రిక ఆత్మకు శాంతి కలుగుగాక' అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.
ఇకపోతే.. ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఫిల్ హ్యస్ మృతి చెందిన నేపథ్యంలో... భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన తొలి టెస్టు వాయిదా పడింది.