Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ డేర్ డెవిల్స్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. అంతా సేఫ్!

Advertiesment
Delhi Daredevils team survives air scare at Raipur airport
, శుక్రవారం, 8 మే 2015 (13:03 IST)
క్రీడా ప్రపంచంలో ఓ పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సభ్యులంతా ప్రయాణిస్తున్న ఇండిగో విమానం రాయ్ పూర్ లోని స్వామీ వివేకానంద ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన సమయంలో రన్ వేపై మరో విమానం నిలిచేవుంది. విమానం ల్యాండ్ అయిన తరువాత ఎదురుగా మరో విమానాన్ని గుర్తించిన పైలెట్ మరింత వేగంగా బ్రేకులు వేసి, ఫ్లయిట్‌ను పక్కకు మళ్లించాడు.
 
ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగినట్టు సమాచారం. రన్ వేపై విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం ల్యాండింగ్‌కు అధికారులు అనుమతివ్వడం విమానయాన రంగంలో ఘోర తప్పిదం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. 
 
కాగా, శనివారం, 12వ తేదీన రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ జట్టు మ్యాచ్‌లను ఆడాల్సివుంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ క్రికెటర్లు ప్రయాణించిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి గట్టెక్కిందని జట్టు యాజమాన్యం తెలిపింది. 
 

Share this Story:

Follow Webdunia telugu