సంగక్కర : రాజకీయాలు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీయలేవు!
రాజకీయాలు క్రీడాస్ఫూర్తిని దెబ్బ తీయలేవని హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. చెన్నై భారత్లో చిన్న భాగం మాత్రమేనని, దేశంలో ఇతర ప్రాంతాల్లో తమకు అపూర్వ స్వాగతం లభిస్తుందని సంగక్కర వ్యాఖ్యానించాడు. తమిళనాడులో జరుగుతున్న ఆందోళనలకు లంక ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని, అయితే తాము ఇక్కడికి ఐపీఎల్ మ్యాచ్లు ఆడడానికి మాత్రమే వచ్చామని సంగక్కర తెలిపాడు. చెన్నై అడుగుపెట్టొద్దని తమ బోర్డు కూడా ఆదేశించిందని సంగక్కర చెప్పాడు. చెన్నైలో జరిగే ఐపిఎల్ మ్యాచ్లకు లంక ఆటగాళ్లకు తమిళనాడు అనుమతి నిరాకరించడాన్ని ఉద్దేశించి సంగక్కర ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.