Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత జట్టుకు దొరికిన హైదరాబాద్ ఆణిముత్యం లక్ష్మణ్

Advertiesment
భారత జట్టుకు దొరికిన హైదరాబాద్ ఆణిముత్యం లక్ష్మణ్
, శనివారం, 22 మార్చి 2008 (17:27 IST)
FileFILE
భారత క్రికెట్ జట్టుకు దొరికిన మరో ఆణిముత్యం హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లృక్ష్మణ్. తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టే లక్ష్మణ్‌కు జట్టులో స్థానమే ప్రశ్నార్థకం. తన స్ట్రోక్ ప్లేలతో సచిన్‌ను మురిపించినా.. మణికట్టు మాయాజాలంతో మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను గుర్తుకు తెచ్చినా జట్టులో స్థానం మాత్రం ఎండమావి లాంటిదే. ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. టెస్టు ఆటగాడిగా ముద్రపడింది. ఈ ముద్ర నుంచి బయటపడేందుకు వీవీఎస్ చేసిన ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిలకడలేని ఫామ్ వల్ల లక్ష్మణ్ తన స్థానాన్ని భారత క్రికెట్ జట్టులో సుస్థిరం చేసుకోలేక పోయాడు.

గత 2001లో స్టీవా నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు జట్టు భారత్ పర్యటనలో చరిత్ర సృష్టించడానికి వచ్చింది. అప్పటికే.. బెంగుళూరులో భారత జట్టును ఓడించిన స్టీవా బృందం కోల్‌కతా టెస్టులో విజయానికి చేరువైంది. ఆ టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్ ఆడిన భారీ ఇన్నింగ్స్.. కంగారులు గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. అప్పటి నుంచి ఇప్పటికీ.. లక్ష్మణ్ అంటే కంగారులకు భయమే.

సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన లక్ష్మణ్.. 281 పరుగులు చేసి భారత్‌ను విజయంపథంలో నడిపించడమే కాకుకుండా.. ఆసీస్ వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేశాడు. ఆ తర్వాత 2003-04లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మరో రెండు సెంచరీలు చేసి కంగారులపై తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అయితే.. భారత జట్టు తరపున ప్రపంచ కప్‌లో ఆడాలన్న తన చిరకాల కోరిక మాత్రం లక్ష్మణ్‌కు ఊరిస్తూనే ఉంది.

వీవీఎస్ లక్ష్మణ్ ప్రొఫైల్...
పూర్తి పేరు.. వంగివరపు వేంకట సాయ్ లక్ష్మణ్
పుట్టిన తేది.. 1974 నవంబరు ఒకటో తేది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్.
ప్రస్తుత వయస్సు.. 33 సంవత్సరాలు 142 రోజులు.
ప్రధాన జట్లు.. భారత్, హైదరాబాద్
నిక్ నేమ్.. వెరీ వెరీ స్పెషల్
బ్యాటింగ్ స్టైల్.. రైట్ హ్యాండ్
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ ఆఫ్ బ్రేక్
విద్యాభ్యాసం.. లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, సెయింట్ జాన్స్ స్కూలు.

Share this Story:

Follow Webdunia telugu