Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత క్రికెట్ జట్టు 'బెవాన్' యువరాజ్ సింగ్

Advertiesment
భారత క్రికెట్ జట్టు 'బెవాన్' యువరాజ్ సింగ్
, శనివారం, 31 మే 2008 (17:34 IST)
FileFILE
భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న యువరాజ్ సింగ్.. 'టీమ్ ఇండియా'లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. 2000-01లో నైరోబీలో జరిగిన మినీ ప్రపంచ కప్‌ పోటీలో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఐసిసి ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లో ఆర్థ సెంచరీని పూర్తి చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

అలాగే ఇంగ్లాండ్ పర్యటనలో ముఖ్యంగా నాట్‌వెస్ట్ ముక్కోణపు సిరీస్‌లో మహ్మద్ కైఫ్‌తో కలసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన యూవీ.. భారత క్రికెట్‌ జట్టుతో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టెస్టుల్లో స్థానం నిలకడ లేక పోయినప్పటికీ వన్డేల్లో మాత్రం ఖచ్చితంగా చోటును దక్కించుకుంటున్నాడు. ఇలా 'టీమ్ ఇండియా'కు మిడిల్ ఆర్డర్ బెవాన్‌గా పేరుతెచ్చుకున్నాడు.

పూర్తి పేరు.. యువరాజ్ సింగ్
పుట్టిన తేది.. డిసెంబరు 12, 1981
బ్యాటింగ్ స్టైల్... లెఫ్ట్ హ్యాండెడర్
బౌలింగ్ శైలి.. స్లో లెఫ్ట్ ఆర్మ్
ప్రధాన జట్లు.. పంజాబ్, యార్క్‌షైర్, పంజాబ్ కింగ్స్ లెవెన్, ఆసియా లెవెన్, భారత్.
టెస్టులు.. 23, ఇన్నింగ్స్.... 36, చేసిన పరుగులు.. 1050, అత్యధిక స్కోరు.. 169, సెంచరీలు 3.
వన్డేలు.. 204, ఇన్నింగ్స్.. 186, చేసిన పరుగులు 5775, అత్యధిక స్కోరు.. 139. సెంచరీలు.. 8.

Share this Story:

Follow Webdunia telugu