Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా ధోనీ ప్రాభవం

Advertiesment
మహామహులు భారత క్రికెట్ చరిత్ర కెప్టెన్ ధోనీ ప్రాభవం
, బుధవారం, 24 సెప్టెంబరు 2008 (15:49 IST)
భారత వన్డే క్రికెట్ సారధిగా విజయవంతంగా కొనసాగుతోన్న మహేంధ్రసింగ్ ధోనీ ప్రాభవం ప్రారంభమై నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ధోనీ నాయకత్వంలో భారత యువ జట్టు దక్షిణాఫ్రికాలో ట్వంటీ20 ప్రపంచ గెలుపు సాధించడంతో కెప్టెన్‌గా ధోనీ ఉన్నత శిఖరాలను అధిరోహించినట్టైంది.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2004లో వికెట్ కీపర్‌గా ప్రవేశించిన ధోనీ బ్యాట్స్‌మెన్‌గా సైతం తన సత్తా నిరూపించుకున్నాడు. తొలినాళ్లలో ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ధోనీ భారత క్రికెట్‌లో తనకంటూ స్ధిరమైన స్థానాన్ని సంపాధించుకున్నాడు.

అటుపై ఓ విజయవంతమైన ఆటగాడిగా అందరి ప్రశంసలు అందుకున్న ధోనీ కొద్ది కాలానికే భారత వన్డే జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా ప్రారంభంలోనే ట్వంటీ20 ప్రపంచకప్‌ను అందించడం ద్వారా కెప్టెన్‌గానూ తనకు తిరుగులేదని నిరూపించాడు. ఇక అప్పటినుంచి అత్యధిక విజయాలను ఖాతాలో వేసుకుంటూ వచ్చిన ధోనీ ప్రస్తుతం ఓ విజయవంతమైన కెప్టెన్‌గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో ప్రపంచకప్‌ను అందుకున్న భారత్ అటుపై అలాంటి చిరస్మరణీయమైన విజయాన్ని అందుకోవడానికి దాదాపు 24ఏళ్లు ఎదురు చూడాల్సివచ్చింది. అలాంటి తరుణంలో ఆటగాడిగా, నాయకుడిగా జట్టును ముందుండి నడిపించిన ధోనీ ట్వంటీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించడం ద్వారా సగటు అభిమాని గుండెల్లో చెరగని ముద్ర వేశాడు.

ట్వంటీ20 విజయం సాధించిన తర్వాత గడిచిన ఏడాది కాలంలోనూ అనేక విజయాలు అందిస్తూ వచ్చిన ధోనీ కొద్దిరోజుల క్రితం శ్రీలంకలో వన్డే సిరీస్‌ను సాధించడం ద్వారా తన సత్తాను చాటాడు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్లు ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై సిరీస్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ధోనీ మరోసారి తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu