Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థర్డ్‌వేవ్ పిల్లలపై ప్రభావం.. అప్రమత్త చర్యలు.. ఎన్​ఐఏఐడీ టీకా సక్సెస్

థర్డ్‌వేవ్ పిల్లలపై ప్రభావం.. అప్రమత్త చర్యలు.. ఎన్​ఐఏఐడీ టీకా సక్సెస్
, గురువారం, 17 జూన్ 2021 (11:23 IST)
కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికల నేపథ్యంలో.. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు అప్రమత్త చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న రెండు టీకాలు ట్రయల్స్‌ అద్భుతమైన ఫలితాలు చూపించాయని పేర్కొంటున్నారు. మెడెర్నాతో పాటు ప్రోటీన్-ఆధారిత ప్రయోగాత్మక టీకాలు పిల్లలకు.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. 
 
ఈ మేరకు కోతి జాతికి చెందిన రీసస్‌ మకాక్‌ (ఆఫ్రికన్‌లాంగూర్‌) పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను సైన్స్​ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించారు.
 
పిల్లల్లో వైరస్ వ్యాప్తిని నివారించడానికి టీకాలు కీలకమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ టీకాల ప్రయోగాలు.. 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు జరిగాయని.. అయితే మరిన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఏడాది పాటు ప్రయోగాలు కొనసాగిస్తున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.  
 
వ్యాక్సిన్​.. స్పైక్​ ప్రోటీన్‌న్లను సృష్టించమని కణాలను నిర్దేశిస్తుంది. ఇది వైరస్.. మానవ శరీరంలోని అన్ని భాగాలకు ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. దీంతో రోగనిరోధక కణాలు ప్రోటీన్‌ను గుర్తించి యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. ఎన్​ఐఏఐడీ టీకాలోనే స్పైక్​ ప్రోటీన్​ ఉంటుంది. దాన్ని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి అదే పరిమాణంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. 
 
రెండు వ్యాక్సిన్లు ఇమ్యునోగ్లోబులిన్ జీని తటస్థీకరించి, కరోనా, స్పైక్ ప్రోటీన్-నిర్దిష్ట టీ కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి అవుతాయని పరిశోధకులు తెలిపారు. అయితే వ్యాక్సిన్లు.. టీ హెల్పర్ టైప్ 2పై ఎలాంటి ప్రభావం చూపలేదని, ఇది పిల్లల్లో భద్రతకు హాని కలిగిస్తుందని.. అలాగే యాంటీబాడీలు ఎదుర్కొని.. చిన్నపిల్లల్లో టీకా అభివృద్ధికి ఆటంకం కలిస్తాయి.
 
కాబట్టి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అయితే పెద్దలకు ఇచ్చే 100 మైక్రోగ్రామ్ డోసుకు బదులుగా.. 30 మైక్రోగ్రాముల డోసు పిల్లలకు ఇచ్చినట్లయితే.. శక్తిమంతమైన ప్రతిరోధకాల వయోజనుల్లో పెరిగిన స్థాయితో పోల్చవచ్చు అని పరిశోధకుల్లో ఒకరైన అమెరికాలోని నార్త్​ కరోలినా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ క్రిస్టినా డి పారిస్​ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ నిర్మాత రూ.10లక్షల విరాళం- సీఎం స్టాలిన్‌ను కలిసి చెక్కు అందజేత