Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

ఆంధ్రాలో 1,296 - కేరళలో 23,260 పాజిటివ్ కేసులు

Advertiesment
Covid Positive Cases
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (19:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 1296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, కేరళ రాష్ట్రంలో ఏకంగా 23260 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కరోనా కేసుల వివరాలను ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. 
 
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,393 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,296 మంది బాధితులు డిశ్చార్జి కాగా, మరో 8 మంది వైరస్‌ ప్రభావంతో మృత్యువాతపడ్డారు.
 
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,36,179కి పెరిగింది. ఇప్పటి వరకు 20,07,330 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 14,052 మంది బాధితులు మరణించారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 17,797 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనాతో చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు మృతి చెందారని పేర్కొంది. 
 
తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 272, తూర్పుగోదావరిలో 206, నెల్లూరులో 201, కృష్ణాలో 162, గుంటూరులో 132, పశ్చిమగోదావరిలో 129, ప్రకాశంలో 120 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేసినట్లు వివరించింది. 
 
ఇకపోతే, కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గ‌త రెండుమూడు రోజుల నుంచి త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసుల సంఖ్య శుక్రవారం మ‌ళ్లీ పెరిగాయి. కొత్తగా 23,260 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
అదేవిధంగా 20,388 మంది క‌రోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 42,56,697కు చేరింది. అలాగే, కొత్త‌గా 131 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మృతుల సంఖ్య 23,296కు పెరిగింది.
 
ఇక‌, కేర‌ళ‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల నుంచి మ‌ర‌ణాలు, రిక‌వ‌రీలు పోను మ‌రో 1,88,926 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మొత్తం 1,28,817 మంది నుంచి శాంపిల్స్ సేక‌రించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా 23,260 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని కేర‌ళ వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఎగబడుతున్నారు: రెండ్రోజుల్లోనే రూ.1,100 కోట్ల సేల్స్