Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ కేసులు.. భారత్‌లో తగ్గుదల - ప్రపంచంలో పెరుగుదల

covid 19
, మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:29 IST)
కరోనా వైరస్ వ్యాప్తి దేశ వ్యాప్తంగా క్రమేపీ తగ్గిపోతోంది. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొత్త కరోనా కేసుల నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,369 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, మరో 5,178 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,347గా ఉంది. మరోవైపు, ఇతర ప్రపంచ దేశాల్లో మాత్రం రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
 
ఇదిలావుంటే, మన దేశంలో ఈ వైరస్ నుంచి 5,28,185 మంది చనిపోయారు. ఇప్పటివరకు 4,39,30,417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో క్రియాశీలక రేటు 0.10 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో విస్తరిస్తోన్న లంపీ వైరస్.. 67 పశువులు మృతి