దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకీ 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో గతంలో కేసుల తీవ్రత తగ్గినా మళ్లీ కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,842 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇంకా ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. మృతుల సంఖ్య 761కి పెరిగింది.
తెలంగాణలో గత 24 గంటల్లో 36,282 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో వ్యాధి నిర్దారణ పరీక్షలు పెరుగుతూనే వున్నాయి.
లక్షణాలున్నవారు సమీపంలోని బస్తీ దవాఖానాల్లో సమాచారం ఇస్తే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. లక్షణాలున్న టెస్టులు చేయించుకోకుండా బయట తిరిగితే మిగిలినవారికి వ్యాధి సోకే అవకాశం ఉంది.